తెలంగాణ విద్యా విధానం దేశానికి దిక్సూచి కావాలి

స్ప‌ష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ : రాష్ట్రంలో విద్యా విధానంలో కీల‌క‌మైన మార్పులు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. బుధ‌వారం స‌చివాల‌యంలో తెలంగాణ విద్యా విధానం రూపకల్పనపై స‌మీక్ష చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. దేశానికి దిక్సూచిలా తెలంగాణ విద్యా విధానం ఉండాల‌న్నారు. భాష, జ్ఞానం, నైపుణ్యాలు, క్రీడల మేళవింపుతో నూతన విద్యా విధానం ఉండేలా ప్లాన్ చేయాల‌ని ఆదేశించారు. ఇందుకు సంబంధించి డిసెంబర్ 9న విజన్ డాక్యుమెంట్-2047 విడుదల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు సీఎం.

విద్యా రంగం సమూల ప్రక్షాళనే త‌మ‌ ధ్యేయం అని స్ప‌ష్టం చేశారు. ప్రత్యేక విద్యా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామ‌న్నారు. మౌలిక వసతుల మెరుగుదలపై ఫోకస్ పెడ‌తామ‌ని చెప్పారు. సిలబస్, వనరుల సమీకరణ, అమలుపై స్పష్టత అవసరం అన్నారు. పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధం అని అన్నారు రేవంత్ రెడ్డి. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామ‌ని, యూనివర్సిటీ వీసీల నియామకాలు పూర్తయ్యాయని తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామ‌న్నారు. విద్య అనేది ఖ‌ర్చు కాద‌ని అది రాబోయే త‌రాల‌కు త‌ర‌గ‌ని సంప‌ద‌గా భావించాల‌ని స్ప‌ష్టం చేశారు ఎ. రేవంత్ రెడ్డి.

  • Related Posts

    నాగర్‌కర్నూల్, వికారాబాద్ ల‌లో కేంద్రీకృత వంట‌శాల‌లు

    హైద‌రాబాద్ : జున్నా సోలార్ సిస్టమ్స్ , చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. శుక్ర‌వారం జూబ్లీ హిల్స్‌లోని త‌న‌ నివాసంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు స‌మావేశం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల…

    ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో విజ‌య్ విఫ‌లం : ఎంకే స్టాలిన్

    తిరుప్పూర్ జిల్లా : రాష్ట్రంలో ధ‌ర‌ల నియంత్ర‌ణను నియంత్రించ‌డంలో టీవీకే స‌ర్కార్ వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు’లో నిమగ్నమైన ఆయనకు ప్రజల కష్టాలు తెలుసా అని ప్రశ్నించారు. గత నాలుగు నెలల్లో నిత్యావసర వస్తువుల…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *