నాగర్‌కర్నూల్, వికారాబాద్ ల‌లో కేంద్రీకృత వంట‌శాల‌లు

హైద‌రాబాద్ : జున్నా సోలార్ సిస్టమ్స్ , చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థల‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు రాష్ట్ర ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. శుక్ర‌వారం జూబ్లీ హిల్స్‌లోని త‌న‌ నివాసంలో హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు స‌మావేశం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఉద్దేశించిన అల్పాహార కార్యక్రమాన్ని సమీక్షించారు సీఎం. ఇదిలా ఉండ‌గా నాగర్‌కర్నూల్ , వికారాబాద్‌లలో కేంద్రీకృత వంటశాలలను ఏర్పాటు చేయడానికి ముందుకు రావ‌డం ప‌ట్ల‌ జున్నా సోలార్ సిస్టమ్స్ , చైన్ ల్యాబ్స్ ఇండియా సంస్థలకు ప్ర‌త్య‌కంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు రేవంత్ రెడ్డి.

ఈ వంటశాలలను నవంబర్ 30 లోగా పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అంతే కాకుండా డిసెంబర్ 9న రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ప్రారంభించాలని స్ప‌ష్టం చేశారు. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదని అన్నారు. ఇది మన పిల్లల భవిష్యత్తులో ఒక పెట్టుబడి అని పేర్కొన్నారు సీఎం. ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థి నాణ్యమైన ఆహారం, మంచి ఆరోగ్యం , మెరుగైన విద్యతో ఉన్నత స్థాయికి ఎదగాలన్నది మా సంకల్పం అని ఈ సంద‌ర్బంగా స్ప‌ష్టం చేశారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నామ‌ని చెప్పారు. త‌మ తొలి ప్రాధాన్య‌త విద్య‌, వైద్యం, ఉపాది అని పేర్కొన్నారు అనుముల రేవంత్ రెడ్డి.

  • Related Posts

    ధ‌ర‌ల నియంత్ర‌ణ‌లో విజ‌య్ విఫ‌లం : ఎంకే స్టాలిన్

    తిరుప్పూర్ జిల్లా : రాష్ట్రంలో ధ‌ర‌ల నియంత్ర‌ణను నియంత్రించ‌డంలో టీవీకే స‌ర్కార్ వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు మాజీ సీఎం ఎంకే స్టాలిన్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు’లో నిమగ్నమైన ఆయనకు ప్రజల కష్టాలు తెలుసా అని ప్రశ్నించారు. గత నాలుగు నెలల్లో నిత్యావసర వస్తువుల…

    కేటీఆర్ ఆస్తులపై విచార‌ణ చేప‌ట్టాలి : ఆకునూరి

    హైద‌రాబాద్ : మాజీ తెలంగాణ విద్యా క‌మిష‌న్ చైర్మ‌న్ ఆకునూరి మురళి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా తీవ్రంగా స్పందించారు. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం దోచుకున్న ఆస్తులపై బేష‌ర‌తుగా విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *