ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు ప‌డ‌డం ఖాయం

స్ప‌ష్టం చేసిన మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

హైద‌రాబాద్ : పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై వేటు ప‌డ‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి. సోమ‌వారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేల‌తో క‌లిసి మాట్లాడారు. నియోజకవర్గ ప్రజలకు ద్రోహం చేసి పార్టీ మారారని వారిని ప్ర‌జ‌లు క్ష‌మించ‌ర‌ని అన్నారు. అన్ని ఆధారాలు శాస‌న స‌భ సెక్రటరీకి సమర్పించ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. తెలంగాణ స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్ కుమార్ సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం అని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ నిర్ణయిస్తారని కడియం శ్రీహరి మాట్లాడ‌టం దారుణ‌మ‌న్నారు. అస‌లు త‌న‌కు సోయి అనేది ఉందా అని నిప్పులు చెరిగారు. త‌మ పార్టీ బి ఫామ్ పై గెలిచి ఇప్పుడు మాట మార్చ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు జ‌గ‌దీశ్ రెడ్డి.

స్పీకర్ నిర్ణయం ఏదైనా ప్రజల దృష్టిలో వారెంటో ఇప్ప‌టికే అర్థ‌మై పోయింద‌న్నారు. వారిపై వేటు ప‌డ‌డం ఖాయ‌మ‌ని, ఇప్ప‌టికే సుప్రీంకోర్టు గ‌డువు ఇచ్చింద‌ని అన్నారు. ఉప ఎన్నికలు రావటం ఖాయ‌మ‌ని, పార్టీ మారిన ఎమ్మెల్యేలు మట్టి కరవటం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రించారు జ‌గ‌దీశ్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీ పుట్టక ముందే ఫిరాయింపుల చట్టం వచ్చిందన్నారు. ఫిరాయింపులు ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. బండి సంజయ్ తిరిగే కార్లు ఏ షోరూంలో కొన్నారో కేటీఆర్ అక్కడే కొన్నార‌ని చెప్పారు. బండి సంజయ్‌వి చిల్లర మాటలు త‌ప్పా అవి ప‌నికి వ‌చ్చేవి కావ‌న్నారు. ఆయ‌న‌ను ఎవ‌రూ కేంద్ర మంత్రి అని అనుకోవ‌డం లేద‌న్నారు.

  • Related Posts

    సీఈఓల‌తో డొనాల్డ్ ట్రంప్ భేటీ వైర‌ల్

    వాషింగ్ట‌న్ : సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నారు అమెరికా దేశాధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆయ‌న ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ప్ర‌పంచాన్ని శాసిస్తున్న టెక్నాల‌జీ ప‌రంగా ఆయా టాప్ కంపెనీల‌కు చెందిన చైర్మన్లు, సీఈఓలు, మేనేజింగ్ డైరెక్ట‌ర్లతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఇందుకు…

    ఓరుగ‌ల్లు ఎయిర్ పోర్టుకు జ‌యశంక‌ర్ పేరు పెట్టాలి

    హైద‌రాబాద్ : తెలంగాణ విశ్లేష‌కుడు వి. ప్ర‌కాశ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం వ‌రంగ‌ల్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎవ‌రి పేరు పెట్టాల‌నే దానిపై పెద్ద ఎత్తున చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కొంద‌రు కాక‌తీయ రాజుల పేరు పెట్టాల‌ని ప్ర‌తిపాదిస్తే మ‌రికొంద‌రు తీవ్ర…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *