చెన్నై సూప‌ర్ కింగ్స్ కోచ్, కెప్టెన్ పై వేటు..?

చెన్నై జ‌ట్టు యాజ‌మాన్యం తీవ్ర అసంతృప్తి

చెన్నై : ఐపీఎల్ 19వ సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆశించిన మేర రాణించ‌లేక పోయింది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో అత్యం పేల‌వ‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. తాజాగా అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన మ్యాచ్ లో గుజ‌రాత్ టైటాన్స్ చేతిలో అత్యంత ఘోరంగా ఓట‌మి పాలైంది. 89 ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యానికి మూట‌గ‌ట్టుకుంది. ఇక ఆడ‌తాడ‌ని అనుకున్న మ‌హేంద్ర సింగ్ ధోనీ ఆడ‌లేక పోయాడు. త‌ను రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇక రూ. 18 కోట్లు పెట్టి ట్రేడింగ్ లో కొనుగోలు చేసిన‌ప్ప‌టికీ కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయాడు.

టోర్నీలో రెండు సెంచ‌రీలు చేసినా కీల‌క‌మైన మ్యాచ్ ల‌లో త‌ను చేతులెత్తేశాడు. అడపా ద‌డ‌పా ప‌టేల్, కార్తీక్ శ‌ర్మ‌, శివ‌మ్ దూబే ఆడారే త‌ప్పా ఆశించిన స్థాయిలో ప‌రుగులు రాబ‌ట్ట‌లేక పోయారు. దీంతో కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ , కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ల‌ను తొల‌గించేందుకు చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ట్లు స‌మాచారం. ఇందుకు ధోనీ కూడా ఓకే చెప్పిన‌ట్టు టాక్. మ‌రో వైపు కెప్టెన్ స్థానంలో సంజు శాంస‌న్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించాల‌ని యోచిస్తున్నార‌ని, కానీ త‌న నిలక‌డ లేమిత‌నం కొంచెం జ‌ట్టుకు ఇబ్బందిగా మారే ఛాన్స్ లేక పోలేద‌ని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *