నిప్పులు చెరిగిన నారా లోకేష్ బాబు
కడప జిల్లా : మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు.
రప్పా, రప్పా అంటే భయపడే వారు ఎవరూ లేరిక్కడ అని హెచ్చరించారు. మీ నాయకుడిని, వారి తండ్రిని చూశాం. రప్పా, రప్పాకు ఎండ్ కార్డ్ వేసే బాధ్యత నాది అన్నారు. రెడ్ బుక్ అంటేనే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. చివరకు ఎర్ర కారు చూసినా భయపడుతున్నారు. జగన్ రెడ్డిది బెంతాహై. మూడు రోజులు బెంగళూరు, మూడు రోజులు హైదరాబాద్, ఒకరోజు తాడేపల్లిలో ఉంటున్నారు. ఆయనకు సీసీడీ( క్రెడిట్ చోరీ డిజార్డర్) ఉంది. వైసీపీ కుట్రల అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
అనేక పరిశ్రమలు జమ్మలమడుగుకు వస్తున్నాయి. రాయలసీమ స్టీల్ ప్లాంట్ ను 2029 నాటికి పూర్తిచేస్తాం. గండికోట నిర్వాసితులకు న్యాయం చేస్తాం. కడప గడ్డపైనే మిషన్ రాయలసీమను ప్రకటించాం. లక్ష కోట్ల ఔట్ లే తో రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దుతాం. రాయలసీమలో కార్లు పరిగెత్తించాం. నేడు ఫైటర్ జెట్లు వస్తున్నాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం. పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. నేతలు మానవ సంబంధాలు పెంచుకోవాలి. నియోజకవర్గ పర్యటనలో ముందుగా కార్యకర్తలను కలుస్తున్నాం. కూటమి మధ్య చిచ్చుకు వైసీపీ యత్నిస్తోంది. అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు సింప్లిసిటీ కోరుకుంటున్నారు. నేను రెండే కార్లను వినియోగిస్తున్నాను. నేతలు అహంకారం వీడాలి. జమ్మలమడుగుకు ఎంఎస్ఎంఈ కంపెనీలను తీసుకువస్తామని మంత్రి చెప్పారు.





