హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటు : స‌విత

పట్టు సాగు పెంచేలా రైతులకు అవగాహన

అమరావతి : హిందూపూరంలో చేనేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ) మంజూరు చేసినట్లు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ క్లస్టర్ తో 292 మంది నేతన్నలకు లబ్ధి చేకూరనుందని వెల్లడించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నాలుగో బ్లాక్ లో ఉన్న తన పేషీలో ఎమ్మెల్యే బాలకృష్ణతో కలిసి హిందూపురంలో స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ) ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి హిందూపురంలో స్మాల్ క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (ఎస్సీడీపీ) ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. అంతకు ముందు హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటు, నేతన్నలకు శిక్షణ అందించే విషయమై ఫ్యాషన్ డిజైనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ, రూ. 1.51 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఎస్సీడీపీకి కేంద్రం రూ.1.44 కోట్లు, లబ్ధిదారులు రూ.7.12 లక్షలు వాటాగా ఇవ్వనున్నారన్నారు. జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం( ఎన్.హెచ్.డి.పి) కింద కేంద్ర ప్రభుత్వం హిందూపురానికి ఎస్సీడీపీ మంజూరు చేసిందన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా నేతన్నలకు ఉపాధి లభించడంతో పాటు వారికి నేటితరం అభిరుచులకు అనుగుణంగా దుస్తుల తయారీలో శిక్షణ ఇవ్వనుమన్నారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందిస్తూ నూతన చేనేత దుస్తుల తయారీలో నిపుణులు, ఫ్యాషన్ డిజైనర్లతో నేతన్నలకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ప్రస్తుత తరం ఆలోచనలు, ఫ్యాషన్ ను దృష్టిలో పెట్టుకుని చేనేత దుస్తుల రూపకల్పనపై నేతన్నలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన జీవనం అందించడానికి ఎస్సీడీపీ ఎంతో దోహడ పడుతుందన్నారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *