టి20 టీమ్ కెప్టెన్ గా సూర్య కుమార్
ముంబై : బీసీసీఐ సెలెక్షన్ కమిటీ కసరత్తు చేస్తోంది టీమిండియా టి20 జట్టు కూర్పుపై. ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తో ఆడే సీరీస్ లకు సంబంధించి వన్డే తో పాటు టెస్టు జట్టును ప్రకటించింది. ఈ రెండు ఫార్మాట్ లకు గుజరాత్ టైటాన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్ మన్ గిల్ ను ఖరారు చేసింది. మరో వైపు టి20 ఫార్మాట్ కు కూడా తననే ఎంపిక చేయాలని ఎంపిక కమిటీ భావించింది. కానీ సెలెక్షన్ కమిటీలో మరో ఇద్దరు సభ్యులు సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతం గంభీర్ ల నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. ముఖ్యంగా కేరళ స్టార్ సంజు శాంసన్ ఎంపిక విషయంలో కూడా గత కొంత కాలంగా ఈ ఇద్దరు చేసిన నిర్వాకంపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.
ఇదే సమయంలో స్వదేశంలో జరిగిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రతిభను చాటాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఇదే సమయంలో సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా సక్సెస్ అయినప్పటికీ వ్యక్తిగతంగా పర్ ఫార్మెన్స్ పరంగా తీవ్ర నిరాశకు గురి చేశాడు. దీంతో తన నాయకత్వ ఎంపికపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తాజాగా దీనిని పటాపంచలు చేస్తూ కోచ్ గంభీర్ పూర్తిగా సూర్య భాయ్ కే కెప్టెన్సీ ఇవ్వాలని , సంజు శాంసన్ కు అంత సీన్ లేదని పేర్కొన్నట్లు సమాచారం. అయితే ప్యానల్ కమిటీ సభ్యులు శాంసన్ కు వైస్ కెప్టెన్సీ అప్పగించాలని పట్టు పట్టడం విశేషం.







