ప్లే ఆఫ్స్ కు చేరుకోక పోవ‌డం బాధాక‌రం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కోచ్ రికీ పాంటింగ్

పంజాబ్ : ఐపీఎల్ 19 సీజ‌న్ నుంచి పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ నిష్క్ర‌మించ‌డం తీవ్ర నిరాశ‌కు గురి చేసింద‌ని వాపోయాడు ఆ జ‌ట్టు హెడ్ కోచ్ రికీ పాంటింగ్. త‌మ జ‌ట్టు అన్ని విభాగాల‌లో రాణించినా సెకండ్ సెష‌న్ లో ఆశించిన మేర ఆడ‌లేక పోవ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు. కోల్ క‌తా తో జ‌రిగిన మ్యాచ్ లో వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్ ర‌ద్దు కావ‌డం త‌మ కొంప ముంచేలా చేసింద‌న్నాడు. సీజ‌న్ ఆరంభంలో వ‌రుస‌గా ఏడు మ్యాచ్ ల‌లో పంజాబ్ గెలిచి స‌త్తా చాటింద‌న్నాడు. ప్ర‌త్య‌ర్తి జ‌ట్ల‌కు వ‌ణుకు పుట్టించింద‌ని తెలిపాడు. కానీ రెండో సెష‌న్ వ‌చ్చేస‌రిక‌ల్లా మా వాళ్లు డీలా ప‌డ్డార‌ని, చివ‌ర‌కు త‌మ ఆశ‌ల‌పై రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నీళ్లు చ‌ల్లేలా చేసింద‌న్నాడు రికీ పాంటింగ్.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఈ సీజ‌న్ త‌మ‌కు అచ్చి రాలేద‌న్నాడు . తాము ఈసారి క‌చ్చితంగా టాప్ -4లో ఉంటామ‌ని అనుకున్న‌ట్లు చెప్పాడు. కానీ త‌న న‌మ్మ‌కాన్ని త‌మ ఆట‌గాళ్లు వ‌మ్ము చేశారంటూ వాపోయాడు. దీనికి తాను ఎవ‌రినీ నిందించ‌డం లేద‌న్నాడు. ప‌రిస్థితులు కూడా త‌మ‌కు అనుకూలంగా రాక పోవ‌డం కూడా ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని పేర్కొన్నాడు హెడ్ కోచ్. ఒక మ్యాచ్ వర్షం కారణంగా ప్రభావితమైంది. నా అంచనా ప్రకారం, ఆ మ్యాచ్ కూడా సక్రమంగా పూర్తయి ఉంటే, మేము కచ్చితంగా గెలిచి ఉండేవాళ్ళం. కానీ ఆ తర్వాత, మాకు పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారడం మొదలయ్యాయి. ఆపై, అత్యంత పేలవమైన ప్రదర్శనలతో మేము వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడిపోయామ‌న్నాడు.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *