ల‌క్నో జ‌ట్టు నుంచి పంత్ కు ఉద్వాస‌న

త‌న స్థానంలో హార్దిక్ పాండ్యాకు ఛాన్స్

ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ఆశించిన రీతిలో ఆడ‌లేక పోయింది రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం. పాయింట్ల ప‌ట్టిక‌లో ఆఖ‌రు స్థానంలో నిలిచింది. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే అత్య‌ధిక ధ‌ర‌కు అమ్ముడు పోయాడు రిష‌బ్ పంత్ . త‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్ కు ప్రాతినిధ్యం వ‌హించాడు. అటు ఆట‌గాడిగా ఇటు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ స్కిప్ప‌ర్ గా పూర్తిగా ఫెయిల్ అయ్య‌డు. తీవ్ర నిరాశ ప‌రిచాడు. దీంతో ల‌క్నో జెయింట్స్ మేనేజ్మెంట్ సీరియ‌స్ అయ్యాడు. పంత్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు.

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్లు ఫైన‌ల్ కు చేరుకున్నాయి. ఈనెల 31న ఈ రెండు జ‌ట్లు టైటిల్ కోసం త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ త‌రుణంలో ల‌క్నోసూప‌ర్ జెయింట్స్ కెప్టెన్ ప‌ద‌వి నుంచి త‌న‌ను త‌ప్పించాల‌ని రిష‌బ్ పంత్ కోరిన‌ట్లు స‌మాచారం. దీనికి ఓకే చెప్పిన‌ట్లు ల‌క్నో జ‌ట్టు య‌జ‌మాని. దీంతో త‌న స్థానంలో కెప్టెన్ గా అత్యంత అనుభ‌వం క‌లిగిన ఆట‌గాడిగా గుర్తింపు పొందాడు ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. కానీ ఈ సీజ‌న్ లో సైతం త‌ను తీవ్ర నిరాశ ప‌రిచాడు. వ్య‌క్తిగ‌తంగా , కెప్టెన్ గా ఆక‌ట్టుకోలేక పోయాడు. త‌నను కూడా త‌ప్పించ‌నుంది ముంబై ఇండియ‌న్స్. ల‌క్నో జ‌ట్టుకు పంత్ కు బ‌దులుగా పాండ్యాకు ఓకే చెప్పిన‌ట్లు టాక్.

  • Related Posts

    తెలంగాణ‌లో రూ. 30 కోట్ల‌తో క్రీడా స‌దుపాయాల క‌ల్ప‌న

    హైద‌రాబాద్ : తెలంగాణ‌కు ఖేలో ఇండియా యూత్ పోటీల నిర్వ‌హ‌ణ‌ను కేటాయించ‌డం ప‌ట్ల పీఎం మోదీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.30 కోట్లతో క్రీడా సదుపాయాల‌ కల్పన జరిగిందన్నారు.…

    మేధావి బిధూరి సోష‌ల్ మీడియాలో వైర‌ల్

    ఢిల్లీ : మ‌హిళా క్రికెట్ రంగంలో మ‌రో తార వెలుగులోకి వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో ఇప్పుడు మేధావి బిధూరి సెన్సేష‌న్ గా మారారు. సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. త‌ను అనుకోకుండా చేసిన హావ‌భావాల‌తో కూడిన వీడియోలు ఇప్పుడు చ‌క్క‌ర్లు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *