ఏపీలో అన్ని విభాగాల్లో ఈవీ బ‌స్సుల వినియోగం

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం

అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. శ‌నివారం సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న స‌చివాల‌యంలో కీల‌క స‌మీక్ష స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా ప‌లు సూచ‌న‌లు చేశారు సీఎం. ప‌ర్యావ‌ర‌ణ హితంగా బ‌స్సులు ఉండాల‌నేది త‌మ ల‌క్ష్య‌మ‌న్నారు. ఇందులో భాగంగానే ఇక నుంచి అన్ని విభాగాల‌లో ఈవీ బ‌స్సులు వినియోగించాల‌ని ఆదేశించారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి మండ‌లిప‌ల్లి రాం ప్ర‌సాద్ రెడ్డి. రానున్న రోజుల్లో పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్ వరకు అన్ని విభాగాల్లో ఈవీ బస్సుల వినియోగిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

స్త్రీ శక్తి పథకం ఆర్టీసీపై భారం కాదని , ఇది సామాజిక బాధ్య‌త అని తాము భావిస్తున్నామ‌న్నారు .
ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని వెల్ల‌డించారు. సిబ్బంది, కండెక్ట‌ర్లు, మెకానిక్ లు, డ్రైవ‌ర్లు ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌ని లేద‌న్నారు. ఏపీఎస్ఆర్టీసీకి ప్రజలకు మధ్య విడదీయరని అనుబంధం ఉందన్నారు. పీపీపీ విధానంలో డిపోల ఆధునీకరణ చేపడతాం అన్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందన్నారు. రెండేళ్లలో నైట్ అలవెన్స్ సహా ఉద్యోగుల పలు సమస్యల పరిష్కారం చేశామ‌ని తెలిపారు. 3000 కొత్త ఈవీ బస్సులతో ఆర్టీసీకి కొత్త రూపు రానుందన్నారు.

  • Related Posts

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    చెరువుల్లో నీళ్ల‌ను వృధా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

    ప్ర‌కాశం జిల్లా : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ఆనం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. చెరువులోని చేపలను పట్టుకునేందుకు నీటిని వదిలేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం ఎల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *