పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ప్ర‌క‌ట‌న

తిరుపతి : ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 3వ తేదీన ఉదయం 11గం||ల నుంచి 12 గం||ల వరకు వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనునట్లు ఆ సంస్థ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, వ్యవస్థలో లోటుపాట్లు, ఓల్టేజ్ మార్పులు, బిల్లింగ్, సోలార్ నెట్ మీటరింగ్, ఓపెన్ యాక్సెతోపాటు భద్రతా అంశాలకు సంబంధించిన సమస్యలను పారిశ్రామిక వినియోగదారులు చర్చించేందుకు వీలుగా ప్రతినెలా మొదటి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహిస్తామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన దలచిన పారిశ్రామిక వినియోగదారులు ప్రతి నెలా మొదటి బుధవారానికి 7 రోజుల ముందు నుంచి మొదటి మంగళవారం మధ్యాహ్నం 2 గంటల వరకు మొబైల్ నంబరు: 8977779471కు కాల్ చేయడం ద్వారా వివరాలను నమోదు చేసుకోవాల్సి వుంటుందని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ లో విద్యుత్ సమస్యపై చర్చించి, పరిష్కరించు కునేందుకు అవకాశం వుంటుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లింకును సంబంధిత వినియోగదారులకు పంపడం జరిగిందని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *