ఇప్ప‌ట్లో ఉద్యోగాలు ఇవ్వ‌లేం : బుర్రా వెంక‌టేశం

Spread the love

20 జాబ్స్ కోసం 19,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి

హైద‌రాబాద్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి బాగో లేద‌ని, అందుకే ఎక్కువ‌గా జాబ్స్ భ‌ర్తీకి సంబంధించి నోటిఫికేష‌న్లు ఇవ్వ‌లేమంటూ బాంబు పేల్చారు. నిరుద్యోగుల‌కు చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు. కేవలం 0.1% నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్నారు. 99.9% నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేమ‌న్నారు బుర్రా వెంక‌టేశం.

ఇటీవల పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 20 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే 19,000 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అలాంటప్పుడు ప్రభుత్వంపై వ్యతిరేకత రావడం సహజం అని చెప్ప‌డం ప‌ట్ల నిరుద్యోగులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఉద్యోగాలు ఇవ్వ‌లేని సంస్థ ఉండీ ఏం లాభ‌మ‌ని ప్ర‌శ్నించారు. అయితే విచిత్రం ఏమిటంటే ప్రభుత్వంపై వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లను మీడియా నియంత్రించాల‌ని సూచించారు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్. దీంతో ఇక జాబ్స్ భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ప‌రోక్షంగా ప్ర‌క‌టించారు.

  • Related Posts

    తెలంగాణ అమ‌ర వీరుల‌కు సీఎం నివాళి

    Spread the love

    Spread the loveజూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌర‌వం ఎక్కువ అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్స‌వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా…

    పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

    Spread the love

    Spread the loveఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ప్ర‌క‌ట‌న తిరుపతి : ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 3వ తేదీన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *