తెలంగాణ అమ‌ర వీరుల‌కు సీఎం నివాళి

Spread the love

జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌర‌వం ఎక్కువ అని అన్నారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్స‌వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా మంగ‌ళ‌వారం ఎ. రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం వద్ద పూల మాల‌లు వేసి ఘ‌నంగా నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను ఆయన స్మరించుకున్నారు.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతిక ప‌రంగా , రాజ‌కీయ ప‌రంగా తీవ్ర నిరాద‌ర‌ణ‌కు గురైంది. వంద‌లాది మంది పోరాటాలు, ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు, స‌మ్మెలు చేప‌ట్టారు. ఆంధ్ర ప్రాంత దోపిడీకి వ్య‌తిరేకంగా గ‌ళం ఎత్తారు. చివ‌ర‌కు గ‌త్యంతరం లేక ఎంద‌రో బ‌లిదానాలు చేసుకోవ‌డంతో అప్ప‌టి యూపీఏ ప్ర‌భుత్వం సోనియా గాంధీ సూచ‌న‌ల మేర‌కు తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని ప్ర‌క‌టించారు. జూన్ 2014 లో కొత్త రాష్ట్రం ఏర్ప‌డింది.

  • Related Posts

    ఇప్ప‌ట్లో ఉద్యోగాలు ఇవ్వ‌లేం : బుర్రా వెంక‌టేశం

    Spread the love

    Spread the love20 జాబ్స్ కోసం 19,000 ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి హైద‌రాబాద్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ చైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం ప‌రిస్థితి బాగో లేద‌ని, అందుకే ఎక్కువ‌గా జాబ్స్…

    పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

    Spread the love

    Spread the loveఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ప్ర‌క‌ట‌న తిరుపతి : ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈనెల 3వ తేదీన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *