భారత్ లో స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టండి

ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞ‌ప్తి

సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ – ఎం (Novostal-M) సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో (Mr. Ivan Demchenko)తో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. వేగవంతమైన పర్యావరణ అనుమతులు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మౌలిక సదుపాయాల మార్కెట్ మద్దతుతో దూసుకుపోతున్న భారత్ లో ఉన్నత శ్రేణి రీబార్, వైర్ రాడ్‌లను తయారుచేసే ఒక అత్యాధునిక EAF (Electric Arc Furnace) స్టీల్ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టాల‌ని నారా లోకేష్ విజ్ఞ‌ప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీసిటీలో తక్షణ రైల్వే సైడింగ్ కనెక్టివిటీతో ఒక స్ట్రక్చరల్ సెక్షన్, రైల్వే ట్రాక్ రోలింగ్ మిల్లును ఏర్పాటుచేయాల‌ని, చెన్నై – బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ పరిధిలో ప్రాంతీయ ఆటోమోటివ్, షిప్‌బిల్డింగ్ పరిశ్రమలకు నేరుగా మెటీరియల్ సరఫరా చేసే ఒక ప్రత్యేకమైన హార్డ్‌వేర్ గాల్వనైజ్డ్ వైర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేప‌ట్టాల‌ని కోరారు. నోవోస్టల్-ఎమ్ సప్లయ్ చైన్ తో ప్రత్యేకమైన వాటర్‌ఫ్రంట్ బెర్త్‌లతో కూడిన ముడి పదార్థాల లాజిస్టిక్స్ హబ్‌ను అభివృద్ధి చేయడానికి ఒక జాయింట్ వెంచర్ ఏర్పాటుకు చొర‌వ చూపాల‌ని ప్ర‌తిపాదించారు. భారత్ లోని సౌర, పవన విద్యుత్ కారిడార్లతో అనుసంధానిస్తూ… లో-కర్బన్ ఉక్కు తయారీలో సహకార భాగస్వామ్యం వహించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

నోవోస్టల్ – ఎం (Novostal-M) చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో మాట్లాడుతూ… స్టీల్ ప్రొడక్షన్, హోల్ సేల్ మెటల్ ఓర్ వ్యాపారంలో నిమగ్నమైన Novostal-M సంస్థ ఏటా 2.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తిచేసి, 60కిపైగా దేశాలకు ఎగుమతి చేస్తోంద‌న్నారు. తమ సంస్థ మార్కెట్ విస్తరణలో భాగంగా భారతదేశంలోని నిర్మాణ, ఉత్పాదక రంగాలకు సెమీ-ఫినిష్డ్, లాంగ్ స్టీల్ ఉత్పత్తులను భారీ పరిమాణంలో ఎగుమతులపై దృష్టి సారించినట్లు చెప్పారు. మెటలర్జికల్ పోర్ట్‌ఫోలియో, పారిశ్రామిక ఫ్యాబ్రికేటర్లకు ప్రీమియం స్టీల్ బిల్లెట్లు, స్ట్రక్చరల్ రీబార్, హై-స్పీడ్ వైర్ రాడ్లు, ప్రత్యేక వెల్డింగ్ వైర్లను తాము సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.

  • Related Posts

    హైదరాబాద్‌కు చారిత్రాత్మకమైన రోజు : శ్రీ‌ధ‌ర్ బాబు

    హైద‌రాబాద్ : రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీ‌ధ‌ర్ బాబు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ ఐటీ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ కంపెనీకి సంబంధించి మెటా ఇండియా సౌత్ సెంట్రల్ డేటా సెంటర్ రీజియన్‌ను ప్రారంభించారు మంత్రి. ఈ సంద‌ర్భంగా…

    2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా ఏపీ

    అమ‌రావ‌తి : వచ్చే పదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందే ఉద్యోగ రంగాల విషయానికి వస్తే.. ఏపీలో 23 క్లస్టర్లు ఉన్నాయి. సాంప్రదాయ తయారీ రంగాలైన సిమెంట్ నుంచి ఆటోమొబైల్, మెటీరియల్ సైన్సెస్ వరకు విస్తృతమైన రంగాలు ఉన్నాయి. రాష్ట్రంలో రేర్ ఎర్త్,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *