వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఫార్మా, బయో టెక్నాలజీ రంగాల్లో క్వాంటం పరిశోధనలు జరగాల్సి ఉందని సీఎం సూచించారు. కాలుష్యం లాంటి బాహ్య కారణాల వల్ల కూడా ప్రమాదకరమైన కాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. ముందే గుర్తించి చికిత్సలు అందించటం ద్వారా రోగులకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు.

వైద్య రంగంలోని వ్యవస్థలు ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానంలో పని చేయాలని సీఎం సూచించారు. ఏపీలో సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటల్ రికార్డులుగా మారుస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వైద్యారోగ్య రంగంలో మరింత వేగంగా ట్రాన్సఫర్మేషన్ జరగాల్సి ఉందని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. కేన్సర్ తో పాటు ఇతర వ్యాధులపై కూడా అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి విస్తృతంగా పరిశోధనలు జరగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎస్ జి.సాయి ప్రసాద్, ఆస్ట్రాజెనెకా ఇండియా ఎండీ ఏ. ప్రవీణ్ రావు , స్ట్రాండ్ లైఫ్ సైన్సెస్, క్యూర్ ఏఐ సంస్థల ప్రతినిధులు, వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

  • Related Posts

    వ్యాపార‌వేత్త‌లు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించు కోవాలి

    అమ‌రావ‌తి : డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఆధారిత నిర్ణయాలు , వినూత్న మార్కెటింగ్ వ్యూహాలను సమర్థవంతంగా ఉపయోగించు కోవడం ద్వారా వ్యాపారాలను వేగంగా విస్తరించవచ్చని క్రీడా నిపుణుడు , కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన ‘BNI…

    ఏపీ-యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్ : అబ్దుల్లా బిన్ తౌక్ అల్

    అమ‌రావ‌తి : కృష్ణా-గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *