ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఎవ‌రూ రావ‌ద్దు

కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే

అమెరికా : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు అభిజిత్ దిప్కే అమెరికా నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి రానున్నారు. త‌న ఆధ్వ‌ర్యంలో ఈనెల 6వ తేదీన శ‌నివారం పార్ల‌మెంట్ ముందు నిర‌స‌న కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చాడు. ఈ సంద‌ర్బంగా అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన ప్ర‌జాస్వామిక వాదులు పెద్ద ఎత్తున ఈ నిర‌స‌న‌కు లోపాయికారిగా మ‌ద్ద‌తు ఇస్తుండ‌డం విస్తు పోయేలా చేసింది. ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు ముగ్గురు కీల‌క‌మైన వ్య‌క్తుల‌ను అధికార ప్ర‌తినిధులుగా నియ‌మించాడు అభిజిత్ దిప్కే.

ఈ సంద‌ర్బంగా త‌ను కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. తాను భారత్‌కు తిరిగి వస్తున్న తరుణంలో ఢిల్లీ విమానాశ్రయం వద్ద గుమిగూడవద్దని తన మద్దతుదారులను, విద్యార్థులను కోరారు. దిప్కే ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. మనం చట్టాన్ని గౌరవించే పౌరులం, కాబట్టి విమానాశ్రయం వద్ద ఎటువంటి గుంపులు లేదా నిరసనలు చేయవద్దు అని విజ్ఞప్తి చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ తన పార్టీ త్వరలో ఒక ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు కూడా దిప్కే ప్ర‌క‌టించాడు.

ఢిల్లీకి చేరుకునే ముందు దిప్కే వైఖరిలో వచ్చిన ఈ మార్పుపై రాజకీయ వర్గాల్లో చర్చలు ఊపందుకున్నాయి.

  • Related Posts

    జర్నలిస్టుల ఇళ్ల స్థలాల ప్రక్రియ వేగ‌వంతం చేయండి

    హైద‌రాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను ఇచ్చేందుకు యుద్ద ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల సంయుక్త కార్యాచ‌ర‌ణ క‌మిటీ ( హ‌చెజేహెచ్ఎస్ జేఏసీ) . ఇళ్ల స్థ‌లాలు లేక ఎన్నో ఏళ్లుగా…

    విప‌క్షాల నినాదాల మ‌ధ్య రాజ్య‌స‌భ వాయిదా

    న్యూఢిల్లీ : విపక్షాల నినాదాల మధ్య రాజ్యసభ వాయిదా ప‌డింది. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేను మాట్లాడనివ్వాలని విపక్షాలు డిమాండ్ చేయడంతో సభ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. దీనిని అధికార పక్షం వ్యతిరేకించింది. ‘జీరో అవర్’ (Zero Hour) కార్యకలాపాల సమయంలో…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *