సీఎం టూర్ సంద‌ర్బంగా 13న స‌మీక్ష స‌మావేశం

మంత్రి కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి వెల్ల‌డి

న‌ల్ల‌గొండ జిల్లా : ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈనెల 17న న‌ల్ల‌గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నార‌ని వెల్ల‌డించారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. ఇందుకు సంబంధించి భారీ స‌భ నిర్వ‌హిస్తున్నామ‌ని, స‌భ‌ను స‌క్సెస్ చేసేందుకు గాను జూన్ 13న స‌మీక్ష స‌మావేశం చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా దర్వేష్‌పురం ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కార్యక్రమాలు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం నల్గొండలో తెలంగాణలోనే గత రెండున్నరేళ్లలో ఇదే అతిపెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు చెప్పారు.

₹13,000 కోట్ల రోడ్డు అభివృద్ధి పనులతో తెలంగాణ ముఖచిత్రం మారి పోతుందని, రహదారి ప్రమాదాలు గణనీయంగా తగ్గడమే కాకుండా గ్రామీణ ప్రాంతాలకు పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజలకు 24 గంటల పాటు కృష్ణా జలాలను అందించేందుకు ₹125 కోట్లతో కొత్త వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి తెలిపారు. దీనికి కూడా ముఖ్యమంత్రి పర్యటన రోజునే వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *