ముదిరాజుల‌కు అన్యాయంపై ప్ర‌శ్నించాలి

Spread the love

మంత్రి వాకిటి శ్రీ‌హ‌రికి బీసీ – ఎ గ్రూప్ కులాలు

హైద‌రాబాద్ : రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి పై బిసీ – ఎ గ్రూపున‌కు చెందిన నేత‌లు మండి ప‌డుతున్నారు. ప్రభుత్వం పరువు తీసిన బీసీ(ఏ)లోకి ముదిరాజులు మార్పు డిమాండ్ అంశం ప్ర‌స్తావించ‌క పోవ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రిగా లోక్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రాష్ట్ర యావత్తు ప్రజానీకం ప్రయోజనాల కోసం పని చేయడం ఆయన బాధ్యత అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి లేకుండా.. సిఎం లేని సమయంలో బిసి కమిషన్ నుంచి పిలుపు లేకుండా.. ఏకపక్ష నిర్ణయంతో కమిషన్ ముందు హాజరు కావడం ధిక్కర స్వరంగా బీసీ – ఏ గ్రూపులోఉన్న కులాలు భావిస్తున్నాయని పేర్కొన్నారు.

తన ముదిరాజ్ కులం ప్రతినిధులతో కలిసి బిసి కమిషన్ ముందుకు వెళ్లి కూర్చొని సొంత సామాజిక వర్గం ప్రయోజనాల కోసం ప్రాధేయ పడడం అనైతికం త‌ప్ప మ‌రోటి కాద‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రాష్ట్ర జ‌నాభాలో అత్య‌ధిక జ‌నాభా క‌లిగిన ముదిరాజుల సామాజిక వ‌ర్గానికి అన్యాయం జ‌రుగుతుంటే ప్ర‌శ్నించ‌క పోవ‌డం, నిల‌దీయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఇది పూర్తిగా విరుద్ద‌మ‌ని మండిప‌డ్డారు. ముదిరాజుల గురించి ప‌ట్టించుకోని వాకిటి శ్రీ‌హ‌రిపై రేవంత్ రెడ్డి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

  • Related Posts

    భాష‌ల‌పై ప‌ట్టు కోసం ప్రాక్టీస్ చేస్తున్నా

    Spread the love

    Spread the loveఎంపీ మ‌హూవా మొయిత్రా కామెంట్స్ న్యూఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ మ‌హూవా మోయిత్రా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. తాను చిన్నతనంలో హిందీ చదువుకున్నాను, చాలా…

    జి7 స‌ద‌స్సు కోసం ఫ్రాన్స్ కు వెళ్లిన మోదీ

    Spread the love

    Spread the loveస్లోవేకియా లో కూడా ప‌ర్య‌టించ‌నున్న పీఎం న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ జీ 7 స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యేందుకు ఫ్రాన్స్ కు బ‌య‌లుదేరి వెళ్లారు. ఇదే స‌మ‌యంలో ఫ్రాన్స్ తో పాటు స్లోవేకియా పర్యటనకు వెళ్లారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *