హైద‌రాబాద్ లో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆందోళ‌న

Spread the love

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి

హైద‌రాబాద్ : అభిజిత్ దీప్కే సార‌థ్యంలోని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) ఆధ్వ‌ర్యంలో ఆదివారం హైద‌రాబాద్ లోని ఇందిరా పార్కు వ‌ద్ద భారీ ఆందోళ‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ఈ నిరసనలో పాల్గొన్నారు ప్ర‌ముఖ ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌, ఉద్య‌మ‌కారుడు, పౌర స‌మాజం ప్ర‌తినిధి సోనమ్ వాంగ్‌చుక్. పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు. కేంద్ర స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల‌నే కీల‌క‌మైన ప‌రీక్ష‌లు లీకుకు గురైన‌ట్లు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీటిని న‌మ్ముకున్న ల‌క్ష‌లాది మంది విద్యార్థులు రోడ్డున ప‌డ్డార‌ని, వారి భ‌విష్య‌త్తు అంధ‌కారంగా మారింద‌న్నారు వాంగ్ చుక్.

ఈ సంద‌ర్బంగా పరీక్షా పత్రాల లీకేజీ ఆరోపణలు , విద్యా వ్యవస్థలోని లోపాలపై ఆందోళన వ్యక్తం చేశారు .ఈ లోపాలకు బాధ్యత వహించాల్సింది కేంద్ర స‌ర్కార్ అని పేర్కొన్నారు. ముక్త కంఠంతో నిన‌దించారు. ఆందోళనకారులకు మద్దతు తెలపడంతో పాటు విద్యా రంగంలో సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. వాంగ్ చుక్. పరీక్షలకు సంబంధించి తరచుగా తలెత్తుతున్న సమస్యలపై తమ అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికారులు మరింత పారదర్శకత. జవాబుదారీతనం పాటించాలని కోరుతూ పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువత ఈ ఆందోళనలో పాల్గొన్నారు.

  • Related Posts

    మ‌మ‌తా బెన‌ర్జీకి కీల‌క నేత‌ల మ‌ద్ద‌తు

    Spread the love

    Spread the loveచీల‌క దిశ‌గా తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ కోల్ క‌తా : ప‌శ్చిమ బెంగాల్ లో ప్ర‌భుత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఇప్పుడు గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటోంది.బెంగాల్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి మధ్య, మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ (TMC)లో పార్టీకి…

    టెండ‌ర్ల గోల్ మాల్ పై విచారణ చేప‌ట్టాలి

    Spread the love

    Spread the loveడిమాండ్ చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న విధానాల‌ను ఎండ‌గ‌ట్టారు. సీఎం రేవంత్ రెడ్డి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *