మోదీ నాయ‌క‌త్వం దేశానికి ఆద‌ర్శ‌ప్రాయం

బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్

విజయవాడ : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం దేశానికి ఆద‌ర్శ ప్రాయం అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఒక నేత అతి సాధారణ జీవితం గడుపుతూ కృషి, పట్టుదలతో ఎదిగారన్నారు. మోదీ ప్రపంచ స్థాయి నేతగా ఎదగడం మనందరికీ గర్వకారణం అన్నారు. దేశంలో అత్యంత ఎక్కువ కాలం ప్రధానిగా మోదీ ఉన్నారన్నారు. నిత్య స్ఫూర్తి ప్రదాత, అవినీతి మచ్చ లేని నాయకుడు మోదీ అని కొనియాడారు. దేశంలో అనితర సాధ్యమైన కార్యక్రమాలు చేసి చూపించింది బీజేపీ అని అన్నారు. ప్రపంచంలో అత్యధికంగా యువత కలిగిన దేశం మనది అన్నారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలను యువ మోర్చా అర్ధం చేసుకోవాలని కోరారు మాధ‌వ్.

చదువుకు చేసే ఉద్యోగానికి సారూప్యత లేని సమయంలో స్కిల్ ఇండియా ఆలోచనను ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. మోదీ ఏఏ అంశాలను ప్రత్యక్షంగా చూశారో వాటిని పథకాల రూపంలో తీసుకు వచ్చారని అన్నారు. దేశ భక్తి పెంపొందించే విధంగా పార్టీ కార్యక్రమాలు ఉన్నాయ‌న్నారు. దేశ అస్తిత్వానికి సంబంధించి పోరాటాలు చేసింది బీజేపీ అని గుర్తు పెట్టుకోవాల‌న్నారు మాధ‌వ్. 2047 నాటికి దేశాన్ని వికసిత్ భారత్ చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రారంభమయ్యింది అని అన్నారు. దీనిపై రాష్ట్ర యువ మోర్చా అందరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని కోరారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *