ఆర్ఎస్ఎస్ కు రిజిస్ట్రేష‌న్ అవ‌స‌రం లేదు

మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ముంబై : రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధ్య‌క్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ సంస్థ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేసిన లోక్ స‌భ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఆయ‌న ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నాడ‌ని, గ‌త కొన్నేళ్లుగా త‌మ సంస్థ ప‌ట్ల అనుచిత వ్యాఖ్య‌లు చేస్తున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్‌. RSS ఒక సంస్థగా నమోదు చేసుకోవాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై భ‌గ‌వ‌త్ స్పందించారు.

ఆ చర్య రాజకీయ ప్రేరేపితమని, ప్రజల మనసుల్లో అనుమానాలు సృష్టించే ఉద్దేశంతో కూడుకున్నదని RSS చీఫ్ అన్నారు. అనేక విషయాలు నమోదు కాకుండానే ఉన్నాయి… హిందూ ధర్మం కూడా నమోదు కాలేదు. ప్రభుత్వ నిధులు అవసరమైన వారు మాత్రమే నమోదు చేసుకుంటారని స్ప‌ష్టం చేశారు. మా ఉనికి గురించి ప్రభుత్వానికి తెలుస అన్నారు. ; గతంలో ప్రభుత్వం మమ్మల్ని రెండుసార్లు నిషేధించింది కూడా అని మ‌రోసారి గుర్తు చేశారు మోహన్ భగవత్ .

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *