సీఎం విజ‌య్ తో సిలాంబ‌ర‌స‌న్ భేటీ

సినీ, రాజ‌కీయ రంగ ప‌రిస్థితుల‌పై చ‌ర్చ‌

చెన్నై : త‌మిళ సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు, న‌టీ న‌టులు, ద‌ర్శ‌క‌, నిర్మాత‌లు , సాంకేతిక నిపుణులు అగ్ర న‌టుడు, సీఎంగా కొలువు తీరిన జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో భేటీ అయ్యేందుకు క్యూ క‌డుతున్నారు. ఇప్ప‌టికే న‌టీమ‌ణులు త‌న‌ను క‌లిసి అభినందించారు. ముఖ్యంగా ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కురాలు , ప్ర‌ముఖ న‌టి ఖుష్బూ సుంద‌ర్ ప‌లుమార్లు విజ‌య్ ను క‌లిసారు. త‌న‌కు అత్యంత ఆత్మీయుడైన వ్య‌క్తి, స‌హ‌చ‌రుడంటూ పేర్కొన్నారు. గ‌తంలో ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అదే మెయింటెనెన్స్ చేస్తున్నాడంటూ కితాబు ఇచ్చారు.

ఇక మ‌రో అగ్ర వ‌ర్ద‌మాన న‌టి సిమ్రాన్ సైతం త‌న కుటుంబంతో క‌లిసి సీఎం విజ‌య్ తోను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకుంది. త‌న‌తో తాను క‌లిసి న‌టించిన సినిమాల‌ను గుర్తు చేసుకుంది. తాజాగా స్టార్ హీరో గా గుర్తింపు పొందిన సిలాంబ‌ర‌స‌న్ సీఎం విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ తో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యాడు. త‌న‌ను క‌ల‌వ‌డం చెప్ప‌లేని సంతోషంగా ఉంద‌న్నాడు. త‌న‌కు సోద‌రుడు లాంటి వాడ‌ని విజ‌య్ ని ప్ర‌శంసించాడు. తమిళనాడు ప్రజలకు సేవ చేస్తున్న ఆయనకు శక్తి, విజయం, దేవుని ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు సిలాంబ‌ర‌స‌న్.

  • Related Posts

    ‘ఆదర్శ కుటుంబం’ నారాయ‌ణ‌మ్మ పాట అదుర్స్

    హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన న‌టుడు విక్ట‌రీ వెంక‌టేశ్. ఇక మాట‌ల మాంత్రికుడిగా, దిగ్గ‌జ ద‌ర్శ‌కుడిగా టాప్ లో కొన‌సాగుతున్నాడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న చిత్రం ఆద‌ర్శ కుటుంబం –…

    సోష‌ల్ మీడియా వ‌ద్దు ప్రేమ‌ను పంచండి

    చెన్నై : ప్ర‌ముఖ న‌టుడు సూర్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న ఫ్యాన్స్ కు కీల‌క సూచ‌న‌లు చేశారు. సోష‌ల్ మీడియాకు దూరంగా ఉండాల‌ని, ద్వేష పూరిత వ్యాఖ్య‌లు చేయొద్ద‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రికీ ప్రేమ‌ను పంచాల‌ని కోరాడు. ఘర్షణలకు దూరంగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *