ప్ర‌జ‌ల కోసం రిషికొండ ప్యాలెస్

Spread the love

ఏపీ మంత్రుల బృందం ప్ర‌క‌ట‌న

అమ‌రావ‌తి : ఏపీ స‌బ్ క‌మిటీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్రజాధనం ఎలా వృథా చేశారో చూపించడానికి టికెట్ పెట్టి ప్రజలను, స్కూల్ పిల్లలను సందర్శనకు అనుమతించాలని కొందరు కోరారన్నారు. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు బాధ్యతగా ఆలోచించారని పేర్కొన్నారు. ఈ ప్రాపర్టీ మినిమం మెయింటెనెన్స్‌కే నెలకు రూ.25 లక్షలు, దాని లావిష్‌నెస్‌ను అలాగే మెయింటెన్ చేయాలంటే దాదాపు రూ.1.5 కోట్లు అవుతుందని తెలిపారు. కాబట్టి మెజార్టీ అభిప్రాయం మేరకు దీనిని ‘రిసార్ట్’ (హాస్పిటాలిటీ) గా కొనసాగించడమే సముచితమని జీఓఎం భావిస్తోందన్నారు.ఈ ప్యాలెస్‌ను అంతర్జాతీయ స్థాయి రిసార్ట్‌గా మార్చే క్రమంలో ఇప్పటికే తాజ్, టాటా, ఫెమా, లీలా, ఎట్మోస్పియర్ కోర్ వంటి పలు దిగ్గజ సంస్థలు ఆసక్తి చూపించాయని మంత్రులు వెల్లడించారు.

అయితే రుషికొండ కింద ఉన్న భూమి కూడా ఇస్తే కలిపి డెవలప్ చేస్తామని అడిగారన్నారు. త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ ఇచ్చి, ఆసక్తి గల సంస్థలను ఆహ్వానిస్తామన్నారు. నిబంధనల ప్రకారం ఎలిజిబులిటీస్, రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (RFQ) పరిశీలించి, మినిమం క్వాలిఫికేషన్స్ మరియు టైమ్ ఫ్రేమ్ పెట్టి కేటాయిస్తామన్నారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు మాత్రమే చేస్తుందిని అన్నారు. తాము నిర్ణేతలం కాదని, ఈ ప్రతిపాదనలను సీఎంకు వివరించి కేబినెట్ ద్వారా అంతిమ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. సంస్థలకు తమ అభిప్రాయాన్ని చెప్పి 10-15 రోజుల్లో సమగ్ర డీపీఆర్‌లతో రమ్మని కోరతామన్నారు. రుషికొండ వైజాగ్ వాసులకు ఎంతో అనుబంధం ఉన్న ప్రాంతం కాబట్టి, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినా ఒక బ్లాక్‌ను కల్చర్ లేదా హెరిటేజ్ సెంటర్‌గా మార్చి ప్రజల సందర్శనార్థం ఉంచాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

  • Related Posts

    డొనాల్డ్ ట్రంప్ తో ప్ర‌ధాని మోదీ భేటీ

    Spread the love

    Spread the loveకీల‌క అంశాల‌పై విస్తృత చ‌ర్చ‌లు ఫ్రాన్స్ : విదేశీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు భార‌త దేశ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఈ సంద‌ర్బంగా ఆయ‌న జి 7 స‌ద‌స్సులో పాల్గొన్నారు. వివిధ దేశాల‌కు చెందిన ప్ర‌ధాన‌మంత్రులు,…

    కృష్ణలంక సీఐపై విచార‌ణ‌కు ఆదేశం

    Spread the love

    Spread the loveఆదేశాలు జారీ చేసిన ఏపీ డీజీపీ విజ‌య‌వాడ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు రౌడీషీట‌ర్ లాక‌ప్ డెత్ పై స్పందించారు. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *