అవినీతిని సహించేది లేదు : సీఎం విజ‌య్

మా పాలన ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోంది

చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం శాస‌న స‌భ జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా జాతీయ గీతం ఆల‌పించ‌డం పై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు డీఎంకే ఎమ్మెల్యేలు. దీనిపై సీఎం క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇది త‌మ హ‌యాంలో జ‌ర‌గ‌లేద‌ని, మీరు పాలించిన స‌మ‌యంలోనే చోటు చేసుకుంద‌న్నారు. బ‌ట్ట కాల్చి త‌మ మీద వేస్తామంటే కుద‌ర‌ద‌ని చెప్పారు సీఎం. ఇదిలా ఉండ‌గా కీల‌క ప్ర‌సంగం చేశారు . రాష్ట్రంలో అవినీతిని స‌హించేది లేద‌ని ప్ర‌క‌టించారు. ఇందులో ఏ పార్టీకి చెందిన వారైనా స‌రే ఉపేక్షించేది లేద‌న్నారు. ఇదే క్ర‌మంలో త‌మ పార్టీకి చెందిన వారున్నా స‌రే వదిలి పెట్టేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా త‌మ పాల‌న ప్రజల ఆశీస్సులతోనే నడుస్తోందని చెప్పారు సీఎం విజ‌య్ జోసెఫ్ చంద్ర‌శేఖ‌ర్. అయితే ప్రజాధనాన్ని కాపాడటంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. ప్రజల కోసం పని చేస్తున్నప్పుడు ప్రత్యర్థులు ఎందుకు భయపడుతున్నారని ప్ర‌శ్నించారు సీఎం . రాష్ట్ర అభివృద్ధే మా లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. ఇప్ప‌టికే పాలించిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు రాష్ట్రాన్ని స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. తాము వ‌చ్చాక అన్నింటిని ప్ర‌క్షాళ‌న చేస్తున్నామ‌ని చెప్పారు.

  • Related Posts

    ఆగ‌స్టు 17 నుంచి ఏపీ అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాలు

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సోమ‌వారం ప్ర‌భుత్వ ప్రధాన కార్య‌ద‌ర్శి శాస‌న స‌భ‌, శాస‌న మండ‌లి స‌మావేశాల తేదీల‌ను వెల్ల‌డించారు. ఇందులో భాగంగా ఆగస్టు 17 నుంచి ఏపీ శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం అవుతాయ‌ని…

    ఎంపీ రేణుకా చౌద‌రి వినూత్న ప్ర‌ద‌ర్శ‌న

    న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్య‌స‌భ స‌భ్యురాలు రేణుకా చౌద‌రి సంచ‌ల‌నంగా మారారు. ఆమె ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌టంలో గుర్తింపు పొందారు. ఉన్న‌ట్టుండి సోమ‌వారం పార్ల‌మెంట్ స‌మావేశాల‌లో అరుదైన స‌న్నివేశానికి వేదికైంది ప్రాంగ‌ణం. కళ్ల‌కు గంత‌లు క‌ట్టుకుని వినూత్నంగా నిర‌స‌న…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *