జ‌క్క‌న్న వార‌ణాసిలో ‘రుద్ర‌’గా మ‌హేష్ బాబు

హైద‌రాబాద్ : రోజు రోజుకు మ‌హేష్ బాబు న‌టిస్తున్న జ‌క్కన్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం వార‌ణాసి. ఇంకా సినిమా చిత్రీక‌ర‌ణ కొన‌సాగుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా విడుద‌ల కాకుండానే కోట్ల వ‌ర్షం కురుస్తోంది సినీ నిర్మాత‌కు. తాజాగా వార‌ణాసికి సంబంధించి ఫోటోలు బ‌య‌ట‌కు వ‌దిలాడు ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి. ‘వారణాసి’లో ‘రుద్ర’గా మహేష్ బాబు మరో కోణాన్ని ఆవిష్కరించారు . ‘వారణాసి’ పోస్టర్లు గమనిస్తే, ‘రుద్ర’ కేవలం ఒక ఉగ్రమైన పాత్ర మాత్రమే కాదని, మహేష్ బాబు ఇందులో కూల్ , సాహసోపేతమైన అవతారంలో కూడా కనిపిస్తారని అర్థమవుతోంది. ‘వారణాసి’ నుండి మహేష్ బాబు ఫస్ట్ లుక్ కు భారీ ఎత్తున స్పంద‌న వ‌స్లోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో నేడు ఆయన అభిమానులందరికీ ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని జోడిస్తూ, ఈ చిత్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ‘వారణాసి’ సినిమా నుండి మహేష్ బాబు ఫస్ట్-లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో ఈ పోస్ట్‌ను పంచుకుంటూ రాజమౌళి “ఉగ్రరూపం మాత్రమే అతని ఏకైక కోణం కాదు…” అని పేర్కొన్నారు. ‘రుద్ర’ కేవలం ఒక ఉగ్రమైన పాత్ర మాత్రమే కాదని, మహేష్ బాబు ఇందులో కూల్ , సాహసోపేతమైన అవతారంలో కూడా కనిపిస్తారని పోస్టర్లు సూచిస్తున్నాయి. ఈ చిత్రంలో నటుడు విభిన్న కోణాలను ప్రదర్శించబో తున్నారని ఈ ఫస్ట్ లుక్ ధృవీకరిస్తోంది. విడుదలైన చిత్రాలలో మహేష్ బాబు గరుడైన , తీవ్రమైన లుక్‌లో కనిపిస్తున్నారు, ఇది ‘వారణాసి’ చిత్రంపై ఉన్న అంచనాలను మరింత పెంచుతోంది. ఈ పాన్-ఇండియా చిత్రం 2027 ఏప్రిల్ 7న థియేటర్లలో విడుదల కానుంది.

  • Related Posts

    య‌శ్ లాంటి సూపర్‌స్టార్‌ను చూడలేదు : నయనతార

    చెన్నై : ఇండియ‌న్ లేడీ అమితాబ్ బ‌చ్చ‌న్ గా గుర్తింపు పొందిన ప్ర‌ముఖ న‌టి న‌య‌న‌తార సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌ను కీ రోల్ పోషించింది గీతూ మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన టాక్సిక్ మూవీలో. బెంగ‌లూరు వేదిక‌గా జ‌రిగిన చిత్రం…

    త‌మిళ సినిమాపై న‌టి శ్రీ‌లీల ఆస‌క్తి..?

    హైద‌రాబాద్ : న‌టి శ్రీ‌లీల ఇప్పుడు త‌మిళ సినీ ఇండ‌స్ట్రీపై ఎక్కువ‌గా దృష్టి సారించింది. ఆమె త్వ‌ర‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ రాబోయే చిత్రం ‘ధర్మన్’లో ఆయనతో కలిసి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో, తమ కెరీర్‌ను విస్తరించు కోవడానికి కోలీవుడ్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *