త‌మిళ‌నాడు అసెంబ్లీలో సీఎం సంచ‌ల‌నం

ప్ర‌జాస్వామ్య ప్రాధాన్య‌త‌పై ప్ర‌సంగం

చెన్నై : త‌మిళ‌నాడు శాస‌న స‌భ‌లో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ త‌న‌కు మాట్లాడ‌టం రాదంటూ విప‌క్షాలు చేసిన కామెంట్స్ కు బిగ్ షాక్ ఇచ్చేలా తన‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు టీవీకే పార్టీ చీఫ్‌, ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్. సుదీర్ఘ రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, త‌దిత‌ర పార్టీల నాయ‌కుల‌కు కోలుకోలేని రీతిలో సమాధానం ఇచ్చారు. ఆయ‌న త‌న స్టైల్ లో ప్ర‌సంగం చేశారు. ప్ర‌జాస్వామ్యం అంటే దోచుకోవ‌డం కానే కాద‌ని ప్ర‌జ‌ల‌కు సేవకులుగా ఉండ‌డమేన‌ని స్ప‌ష్టం చేశారు జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

నక్కలకు వ్యతిరేకంగా ఆయ‌న త‌న గొంతు వినిపించారు. తాను ప్రాణం ఉన్నంత వ‌ర‌కు త‌మిళ‌నాడు ప్ర‌జ‌ల కోసం అలుపెరుగ‌ని రీతిలో ప‌ని చేస్తానంటూ మ‌రోసారి స‌భ సాక్షిగా ప్ర‌క‌టించారు . ముఖ్యమంత్రికి మాట్లాడటం రాదా? అని ముసుగులు వేసుకుని వచ్చినవారు త‌ను మాట్లాడటం మొదలు పెట్టగానే వారి ముసుగులు తొలగి పోయాయి, తిరిగి ఒక్క మాట కూడా అనకుండానే వారు పారిపోయారు. త‌ను ప్ర‌జ‌ల మ‌నిషినన‌ని, ప్ర‌జా సేవ త‌ప్ప త‌న‌కు వేరే తెలియ‌ద‌ని ప్ర‌క‌టించారు. ఇక నుంచి పాల‌న మ‌రింత పార‌ద‌ర్శ‌కంగా ఉండేలా చూస్తాన‌ని అన్నారు. మొత్తంగా ఇవాళ మ‌రోసారి దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారారు సీఎం విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్.

  • Related Posts

    ‘జ్యోతిర్లింగాలు, మహాశక్తి పీఠాల’పై పుస్తకం ఆవిష్కరణ

    హైదరాబాద్ : భారతీయ ఆంగ్ల రచయిత్రి డాక్టర్ శిఖా భట్నాగర్ రచించిన ఆరవ పుస్తకం “జ్యోతిర్లింగాలు మరియు పద్దెనిమిది మహాశక్తి పీఠాల పౌరాణిక కథనాలు” ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సింగరేణి…

    కేసీఆర్ పై మ‌రీ ఇంత దిగ‌జారి రాస్తే ఎలా..?

    హైద‌రాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు, నేతలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు మాజీ సీఎం , త‌మ పార్టీ బాస్ కేసీఆర్ ప‌ట్ల మ‌రీ దిగ‌జారుడు రాత‌లు రాస్తున్న ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ‌పై. ఈ సంద‌ర్బంగా తీవ్ర స్థాయిలో మండిప‌డుతున్నారు. 72…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *