టీఎంసీ చైర్ ప‌ర్స‌న్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ తొల‌గింపు


తదుపరి టీఎంసీ చైర్‌పర్సన్‌గా అరూప్ రాయ్

కోల్ క‌తా : టీఎంసీ పార్టీ ఫౌండ‌ర్ , చైర్ ప‌ర్స‌న్ గా ఉన్న మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. త‌న‌ను పార్టీ చైర్ ప‌ర్స‌న్ ప‌ద‌వి నుంచి త‌ప్పిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు తిరుగుబాటు టీఎంసీ నేత రితాబ్రత బెనర్జీ .అరూప్ రాయ్ తదుపరి టీఎంసీ చైర్‌పర్సన్‌గా ఉంటారని ప్ర‌క‌టించారు. ఆర్థిక అవకతవకలను పరిశీలించడానికి, పార్టీ బ్యాంక్ ఖాతాలను తనిఖీ చేయడానికి ఒక ప్రత్యేక ఆడిటర్‌ను నియమించాలని తాము నిర్ణయించిన‌ట్లు వెల్ల‌డించారు. మమతా బెనర్జీ గనుక టీఎంసీకి ప్రధాన సలహాదారుగా ఉండాలని అనుకుంటే, ఆమెకు సాదర స్వాగతం ప‌లికేందుకు సిద్దంగా ఉన్నామ‌న్నారు.

తాజా అప్‌డేట్ల కోసం మా హ్యాండిల్‌ను అనుసరించండి. దీంతో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. రితాబ్రత బెనర్జీ నేతృత్వంలోని అసమ్మతి ఎమ్మెల్యేలు కోల్‌కతాలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో సమావేశం అయ్యారు. తాము “అసలైన TMC”గా పేర్కొన్న వర్గానికి సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను చైర్‌పర్సన్‌గా ప్రకటించారు . ఈ నిర్ణయంతో, మమత పార్టీ చైర్‌పర్సన్ పదవిని కోల్పోయారని అసమ్మతివాదులు ప్రకటించారు. అయితే ఆమె విధేయులు మాత్రం ఆమెనే పార్టీ అధినేతగా కొనసాగుతున్నారని వాదించారు.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *