Thursday, 12 November 2026

కార్పొరేట్ సంస్థ‌ల కోస‌మేనా ర‌ద్దు నిర్ణ‌యం..?

newsseals-TelanganGovt

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా తీసుకున్న నిర్ణ‌యం సంచ‌ల‌నంగా మారింది. ఇంటర్మీడియట్ బోర్డును రద్దు చేయాలన్న నిర్ణయం చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ సంస్థలకు ప్రయోజనం చేకూరుస్తుందన్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికే విద్యా రంగం పూర్తిగా కాసుల కోస‌మేన‌న్న అప‌వాదు మూట‌గ‌ట్టుకుంది. 12వ తరగతి వరకు ఒకే బోర్డు ఉంట అది చైతన్య, నారాయణ టెక్నో పాఠశాలలకు ఒక కానుక అవుతుందే త‌ప్పా మ‌రోటి కాద‌ని అంటున్నారు విద్యార్థుల పేరెంట్స్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యతో విలీనం చేయడానికి సిద్ధం కావ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈల మాదిరిగానే 10+2 విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు

వందలాది క్యాంపస్‌లతో చైతన్య, నారాయణ విద్యా రంగంలో అగ్రగామిగా ఎదుగుతున్నాయి.
కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఐఐటీల పేరుతో పాఠశాలల్లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇంటర్మీడియట్ కళాశాలలను రద్దు చేస్తే, 8వ తరగతి నుంచే ప్యాకేజీ లాగా ఫీజులు వసూలు చేసే అవకాశం వారికి లభిస్తుందని వాపోతున్నారు పేరెంట్స్. ప్రభుత్వం ఇప్పటికే 10వ తరగతిలో గ్రేడింగ్‌ను రద్దు చేసి, మార్కుల విధానాన్ని తిరిగి తీసుకు వచ్చింది . పాత రోజుల్లో మాదిరిగానే, కార్పొరేట్ సంస్థలు ప్రచారం ద్వారా లక్షల రూపాయలు ఆర్జించడానికి మార్కుల విధానాన్ని ఉపయోగించుకున్నాయి .ఇదిలా ఉండగా, ప్రభుత్వ పాఠశాలలు విలీన నిర్ణయం వల్ల ఇంటర్మీడియట్ కళాశాలలు అనిశ్చితిలో పడిపోతాయి 10+2 విధానంతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు తగ్గే అవకాశం ఉండగా, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రవేశాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మేధావులు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *