ఒకే వేదిక‌పై ముగ్గురు ముఖ్య‌మంత్రులు

ఒకే ఫ్రేమ్‌లో CBN, రేవంత్, DK

క‌ర్ణాట‌క : క‌ర్ణాట‌క రాష్ట్రంలో అరుదైన స‌న్నివేశం చోటు చేసుకుంది. గుర‌వారం తుంగభద్ర ప్రాజెక్టు 33 కొత్త క్రస్ట్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా కర్ణాటకలోని హోస్పేటలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో కలిసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర జల వివాదాలు, ప్రాజెక్టుల నిర్వహణపై ముగ్గురు ముఖ్యమంత్రులు కీలక చర్చలు జరిపారు. సాధ్య‌మైనంత మేర‌కు సామ‌ర‌స్య పూర్వ‌కంగా నీటి పంప‌కాలు చేప‌ట్టాల‌ని కోరారు.

ఇప్పటికే ఆయా రాష్ట్రాల మ‌ధ్య నీటి వివాదాలు మ‌రింత ముదురుకున్నాయి. ఈ సంద‌ర్బంగా ముగ్గురు సీఎంలు ఒకే వేదిక‌పైకి రావ‌డం, క‌లుసు కోవ‌డం, చ‌ర్చలు జ‌ర‌ప‌డం ఒకందుకు ఆశ్చ‌ర్యం అనిపించింది. అయితే పాలిటిక్స్ లో ఆరితేరిన చంద్ర‌బాబు నాయుడు కు శిష్యుడిగా పేరు పొందాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే స‌మ‌యంలో క‌ర్నాట‌క సీఎంగా ఇటీవ‌లే కొలువు తీరిన డీకే శివ‌కుమార్ కు నారా చంద్ర‌బాబుతో మంచి స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ ఇద్ద‌రి మ‌ధ్య వ్యాపార‌, వాణిజ్య ఒప్పందాలు, లావాదేవీలు ఉన్న‌ట్లు పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Related Posts

    అగ్నిమాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

    అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర హోం, విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ‌ల మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో అగ్ని మాప‌క శాఖ‌లో ప‌ని చేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ ప్ర‌శంసలు కురిపించారు. సోమ‌వారం విజయనగరం జిల్లాలో…

    జ‌గ‌న్ రెడ్డి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం : డోలా శ్రీ బాల

    అమ‌రావ‌తి : మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. ఆయ‌న చేస్తున్న ఆరోప‌ణ‌లలో వాస్త‌వం లేద‌న్నారు. సోమ‌వారం మంత్రి మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం సర్వీస్ రూల్స్ లేకుండా, నిర్దిష్ట…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *