స్త్రీ శ‌క్తి ప‌థ‌కం సాధికార‌త‌కు ద‌ర్ప‌ణం

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన మంత్రి ఎస్. స‌విత

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీలో కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక అభివృద్ది ప‌రుగులు పెడుతోంద‌ని చెప్పారు. గత ప్రభుత్వం బస్సు ఛార్జీలు పెంచితే, మహిళా పక్షపాతి అయిన సీఎం చంద్రబాబు నాయుడు స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. అన్ని గ్రామాల్లోనూ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కూడా నిర్మిస్తున్నామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని చూసి, వైసీపీ నేతలు ముక్కున వేలేసుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వంలో కూడా సీఎంఆర్ఎఫ్ నిధులు ఇంత పెద్ద స్థాయిలో మంజూరు కాలేదని వారు చెప్పుకుంటున్నారన్నారు ఎస్. స‌విత‌.

ముఖ్యంగా పెనుకొండ నియోజక వర్గ వ్యాప్తంగా రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామన్నారు. ముఖ్యంగా పెనుకొండ నియోజక వర్గంలో నేటి వరకూ రూ.13.40 కోట్లకుపైగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేశామన్నారు. నేడు 121 మంది లబ్దిదారులకు రూ.కోటీ 15 లక్షలను ఇచ్చామ‌న్నారు ఎస్. స‌విత .ఎస్. పెనుకొండ తన జాగీరేనని, గతంలో ఎన్నడూ జరగలేనంత అభివృద్ధి తన హయాంలోనే జరుగుతోందని మంత్రి సవిత స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే హక్కు తమకే ఉందన్నారు. అనంతరం లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్ లను మంత్రి సవిత అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    కొత్త దరఖాస్తుదారులకు 20లోగా ఆర్థిక సాయం

    అమరావతి : నేతన్నల సేవలో పథకం కింద అర్హులందరికీ ఆర్థిక సాయం అందిస్తామని ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. సాంకేతిక కారణాల రీత్యా కొందరికి ఇంకా నగదు జమ కాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం…

    హల్ద్వానీ ఘటనకు నిరసనగా కాంగ్రెస్ మార్చ్

    హైద‌రాబాద్ : హల్ద్వానీ ఘటనకు నిరసనగా, కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకి సంఘీభావంగా జిల్లా స్థాయిలో మార్చ్, సత్యాగ్రహం నిర్వ‌హించాల‌ని టీపీసీసీ నిర్ణ‌యించింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్ గారు జారీ చేసిన లేఖ ప్రకారం, హల్ద్వానీలో కాంగ్రెస్ పార్టీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *