అక్కా చెల్లెళ్ల‌తో ఆటాడుకుంటున్న చంద్ర‌బాబు

నిప్పులు చెరిగిన మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

తాడేప‌ల్లిగూడెం : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ ప‌నితీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85 వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో సీఎం చంద్ర‌బాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాదాపు 20 ఏళ్లకు పైబడి పనిచేస్తున్న వారు వీరిలో చాలామంది ఉన్నారని అన్నారు. ఇప్పుడు, స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్క చెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిలు పెట్టారని పేర్కొన్నారు మాజీ సీఎం .

గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.1000 ఉండే జీతాన్ని రూ.3000 వేల వరకూ వైయస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు , ఇప్పుడు స్మార్ట్‌ కిచెన్స్‌ పేరుతో వీరిని తొల‌గించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు. మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున పోరాడుతాం అని ప్ర‌క‌టించారు జ‌గ‌న్ రెడ్డి. వారికి అండగా నిలుస్తాం అన్నారు. ఇప్పటికే బకాయి పెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని అన్నారు.

  • Related Posts

    తుమ్మలను కలిసిన కోస్టారికా ఏఎస్‌డీ కంపెనీ ప్రతినిధులు

    హైద‌రాబాద్ : కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్ర‌తినిధులు మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన నూతన తరం, అధిక నాణ్యత గల ఆయిల్‌పామ్ విత్తనాలను కోస్టారికా నుంచి సరఫరా చేసే అంశంపై మంత్రితో…

    ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన‌ స్వేచ్ఛ అత్యంత కీలకం

    హైద‌రాబాద్ : ప్రజాస్వామ్యానికి భావ ప్రకటన‌ స్వేచ్ఛ అత్యంత కీలకం అని స్ప‌ష్టం చేశారు ప్ర‌జా ప్ర‌తినిధులు. తెలంగాణ విద్వేష ప్రసంగాల ప్రత్యేక కమిటీ ఛైర్మన్‌తో అసెంబ్లీ కమిటీ హాల్‌లో కమిటీ రెండవ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *