జగన్ రప్పా రప్పా క్రెడిట్ మాకొద్దు

శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. శ్రీ స‌త్య‌సాయి జిల్లాలో ప‌ర్య‌టించారు. తనను కలిసిన విలేకరులతో మంత్రి సవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు నాయుడు సమర్థ‌ నాయకత్వంలో రైజింగ్ రాయలసీమ ఆవిర్భవిస్తోందని మంత్రి తెలిపారు. రూ.16,350 కోట్లతో రాయలసీమ స్టీల్ ప్లాంట్ పరిశ్రమ ఏర్పాటవుతోందని, ఈ పరిశ్రమతో వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందని చెప్పారు. ఇప్పటికే రాయలసీమను డ్రోన్ హబ్ గా, పారిశ్రామిక హబ్, టూరిజం హబ్ గా, హార్టీకల్చర్ హబ్ గా రూపొందించేలా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. యుద్ధ విమానాలు, రాయల్ ఇన్ ఫీల్డ్ ద్విచక్ర వాహనాల తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని పేర్కొన్నారు ఎస్. స‌విత .

రాయలసీమను అన్నివిధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పని చేస్తున్నార‌ని స్ప‌ష్టం చేశారు. . స్టీల్ ప్లాంట్ ఏర్పాటు తమ ఘనతేనని జగన్ చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 2018లోనే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు భూమి పూజ చేశారన్నారు. జగన్ క్రెడిడ్ అంతా రప్పా రప్పా నరకడం, విధ్వంసమేనన్నారు. తమ ప్రభుత్వానిది అభివృద్ది క్రెడిట్ అన్నారు. జగన్ రప్పా రప్పా క్రెడిట్ తమకు అవసరం లేదన్నారు. అమరావతికి వ్యతిరేకంగా ఎన్నికలకు వెళతామంటున్న జగన్ ను 2024 ఎన్నికల్లోనే ప్రజలు ఓడించి తగిన గుణపాఠం చెప్పారని మంత్రి సవిత ఎద్దేవా చేశారు.

  • Related Posts

    కేసీఆర్ సంక‌ల్పానికి ప్ర‌తిరూపం ఐటీ విస్త‌ర‌ణ : కేటీఆర్

    హైద‌రాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం , త‌న తండ్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు ఇవాళ తెలంగాణ‌ను దేశంలోనే అన్ని రంగాల‌లో టాప్ లో నిల‌బెట్టేలా చేశాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి మూలకు ఐటీ…

    నాణ్య‌మైన యూనిఫాంల‌ను అందించ‌క పోతే ఎలా..?

    హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయ‌న రాష్ట్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల తీవ్ర అభ్యంత‌రం తెలిపారు. రాష్ట్రంలో రోజు రోజుకు విద్యా వ్య‌వ‌స్థ దారుణంగా దిగ‌జారి పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న వ్య‌క్తం చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *