Friday, 16 October 2026

గోదావ‌రి పుష్క‌రాల ఏర్పాట్ల కోసం రూ. 1500 కోట్లు

newsseals-PonguruNarayana

అమ‌రావ‌తి : ఏపీలో గోదావ‌రి పుష్క‌రాల ప‌నుల కోసం ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు రూ. 1500 కోట్లు మంజూరు చేశారు. ఈ విష‌యాన్ని శ‌నివారం వెల్ల‌డించారు రాష్ట్ర పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. రాజమహేంద్రవరం ఇవాళ ప‌ర్య‌టించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులు ,ప్రజా ప్రతినిధులతో మంత్రి నారాయణ సమీక్ష చేప‌ట్టారు. సమీక్షకు ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, జిల్లా కలెక్టర్ కీర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, రాజహేంద్రవరం లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చ జ‌రిగింది.

గోదావరి పుష్కరాల పనులను త్వ‌రిత‌గ‌తిన ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నిధులు మంజూరు చేసిన‌ట్లు చెప్పారు నారాయ‌ణ‌. మంజూరైన నిధుల‌లో రాజమహైంద్రవరం లో పుష్కరాల పనుల కౌసం 580కోట్లు పనులకు సీఎం అనుమతి ఇచ్చార‌ని వెల్ల‌డించారు. పుష్కరాలకు రాజమహేంద్రవరంలో కల్పించాల్సిన సదుపాయాలు పై చర్చించ‌డం జ‌రిగింద‌న్నారు నారాయ‌ణ‌. స‌మావేశం అనంత‌రం మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత నిధులతో తొలిదశ పనులను ప్రారంభిస్తున్నాం అన్నారు. రాజ మహేంద్రవరం లో మురుగు నీటి శుద్ది కేంద్రాలను నిర్మిస్తాం అని తెలిపారు. గోదావరిలో మురుగు నీరు కలువకుండా చర్యలు చేపడుతున్నామ‌న్నారు. డ్రైనేజీ కాలువల నిర్మాణం కోసం 140 కోట్లతో పనులు చేస్తాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *