Friday, 16 October 2026

సింహాచ‌లం స‌న్నిధిలో బీజేపీ చీఫ్ నితిన్ న‌బిన్

neewsseals-NitinNabin

విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖప‌ట్నం జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు నితిన్ న‌బిన్. ఈ సంద‌ర్బంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు.స్వామివారిని దర్శించుకున్న నితిన్ నబిన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు బీ.ఎల్. సంతోష్ జీ, రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయన వెంట ఉన్నారు. అనంతరం విశాఖపట్నంలో నిర్వహిస్తున్న రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశంలో నితిన్ నబిన్ పాల్గొన్నారు. ఆయ‌న వెంట ఏపీ రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధ‌వ్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *