మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయండి

సియోల్ (సౌత్ కొరియా) : దక్షిణ కొరియాకు చెందిన GaN ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ (Soft-Epi) కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ (Mr. Sung Min, Hwang), సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్-సుంగ్ చో (Mr. In-sung, Cho)లతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో భేటీ అయ్యారు.​ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. భారత్ లోని కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని..డిస్‌ప్లే తయారీదారుల కోసం ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే-మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

తిరుపతి ఐఐటీ సహకారంతో ఒక అడ్వాన్స్‌డ్ ఎపిటాక్సీ సెంటర్, GaN ఎపిటాక్సీ, MOCVD, మైక్రో ఎల్ఈడీలలో ఏటా 500 మంది టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చే సాఫ్ట్-ఈపీఐ అకాడమీని ఏపీ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటు చేయాలని కోరారు. సాఫ్ట్-ఈపీఐ ప్రైవేట్ లిమిటెడ్ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్ మాట్లాడుతూ… తమ సంస్థ దక్షిణ కొరియాలో GaN ఎపివేఫర్లు (epiwafers), మైక్రో-LED ఉత్పత్తులను తయారుచేసి ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి చేస్తుందని చెప్పారు. భారత్ లో ప్రస్తుతానికి ప్రత్యక్ష తయారీ, కార్యకలాపాలు లేవని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని తెలిపారు.

  • Related Posts

    టీపీబీఓపై సీఎంసీ కమిష‌న‌ర్ స‌స్పెన్ష‌న్ వేటు

    హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని అంజయ్య నగర్ భవన కూల్చివేత ఘటన క‌ల‌క‌లం రేపింది. ఈ సంఘ‌ట‌నకు సంబంధించి సీఎంసీ క‌మిష‌న‌ర్ జి. శ్రీ‌జ‌న సీరియ‌స్ అఅయ్యారు. ఈ సంద‌ర్బంగా ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన టీపీబీఓపై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. ఆగ‌స్టు 22న…

    ఇంపీరియ‌ల్ కాలేజీని సంద‌ర్శించిన సీఎం స‌ల‌హాదారు

    లండ‌న్ : తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన కె. రామకృష్ణారావు లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన ఇంపీరియల్ కళాశాలను సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన ఇంపీరియల్ కళాశాల అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ , వ్యూహాత్మక అనుసంధాన విభాగం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *