ఇంపీరియ‌ల్ కాలేజీని సంద‌ర్శించిన సీఎం స‌ల‌హాదారు

లండ‌న్ : తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సలహాదారు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అయిన కె. రామకృష్ణారావు లండన్‌లోని ప్రతిష్టాత్మకమైన ఇంపీరియల్ కళాశాలను సందర్శించారు .ఈ సందర్భంగా ఆయన ఇంపీరియల్ కళాశాల అధ్యక్షుని చీఫ్ ఆఫ్ స్టాఫ్ , వ్యూహాత్మక అనుసంధాన విభాగం (Strategic Engagement Department) ఉపాధ్యక్షురాలైన అమండా వోల్టుయిజెన్, అలాగే దక్షిణాసియా , ఆస్ట్రలేషియా ప్రాంతాల సీనియర్ అంతర్జాతీయ సంబంధాల మేనేజర్ రోసన్నా గిల్లెస్పీలతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా రామ‌కృష్ణా రావు వారికి తెలంగాణ రాష్ట్ర ప్రత్యేకతలు , విద్యా రంగంలో ఉన్న అవకాశాలను వివరించారు. తెలంగాణతో కలిసి పనిచే యడానికి గల సహకార అవకాశాలపై కూడా చర్చలు జరిగాయి.

తెలంగాణ లోని వివిధ ప్రాంతాల‌తో పాటు హైదరాబాద్‌లలో స్వల్పకాలిక కోర్సులు , ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలను నిర్వహించే అవకాశాలను పరిశీలిస్తామని అమండా తెలిపారు. పరిశోధన సహకారం, అలాగే విద్యార్థులు మరియు అధ్యాపకుల మార్పిడి కార్యక్రమాల విషయంలో తెలంగాణతో భాగస్వామ్యం ఏర్పరచు కోవడానికి తమకు ఆసక్తి ఉందని ఆమె వెల్లడించారు. అదే సమయంలో ఈ ఏడాది డిసెంబర్ 7, 8 , 9 తేదీలలో హైదరాబాద్‌లో జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’కు హాజరు కావాల్సిందిగా కె. రామకృష్ణారావు ఇంపీరియల్ కళాశాల ప్రతినిధులను ఆహ్వానించారు.

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, వైద్యం (STEM-ESTEEM) , వ్యాపార విద్య రంగాలలో ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వ విద్యాలయాలలో ఒకటిగా ఇంపీరియల్ కళాశాల గుర్తింపు పొందింది. ఇంతటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థతో భాగస్వామ్య అవకాశాలపై జరిగిన ఈ చర్చలు, రాష్ట్రాన్ని అంతర్జాతీయ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే ప్రయత్నాలకు మరింత ఊతాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు రామ‌కృష్ణా రావు.

  • Related Posts

    నాకెందుకు షోకాజ్ నోటీసులు ఇస్తారు..?

    హైద‌రాబాద్ : రాష్ట్ర దేవాదాయ‌, ద‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న కూతురు కొండా సుష్మితా ప‌టేల్ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డిని, ప‌ర‌కాల ఎమ్మెల్యే రేవూరి ప్ర‌కాష్ రెడ్డిని, సీఎం బ్ర‌ద‌ర్స్ కొండ‌ల్ రెడ్డి, తిరుప‌తి…

    గ్లోబ‌ల్ నాలెడ్జ్ హ‌బ్ గా హైద‌రాబాద్ : సీఎం

    లండన్ : ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని అధికారిక బృందం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి చెందిన విద్యావేత్తల బృందంతో అత్యంత ఫలప్రదమైన, ఆసక్తికరమైన సమావేశాన్ని నిర్వహించింది. హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించడానికి, అంతే కాకుండా ప్రపంచ స్థాయి ‘గ్లోబల్ నాలెడ్జ్ హబ్’…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *