హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ కు తీపి కబురు చెప్పింది తెలంగాణ హైకోర్టు. ఇప్పటికే పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఆపై తనను అరెస్ట్ చేశారు. కానీ ఏమైందో ఏమో ఎవరి ఒత్తిళ్లు పని చేశాయో తెలియదు..కానీ న్యాయస్థానం ఉన్నట్టుండి మనోడికి బెయిల్ మంజూరు చేసింది. గత మే నెల 16న భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యాడు. చర్లపల్లి జైలులో ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు..గత నెల 20న మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన భగీరథ్ బీబీఏ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యాడు..!
25న తిరిగి జైలుకు వెళ్లాడు.గత నెలాఖరులో సాధారణ బెయిల్ కోసం భగీరథ న్యాయవాదుల ద్వారా కోర్టు ను అభ్యర్థించాడు. ఈ నేపథ్యంలో విచారణ జరిపిన హై కోర్టు ఈ రోజు భగీరథ్ కు షరతులతో కూడిన సాధారణ బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచీకత్తు.. సాక్ష్యాలను ప్రభావితం చేసే చర్యలకు పాల్పడవద్దని కోర్టు భగీరథ ను ఆదేశించింది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా మాట్లాడే కేంద్ర మంత్రి తన పంతాన్ని నెగ్గించు కోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక్కడ సర్కార్ కూడా రేపిస్ట్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వంత పాడడం విస్తు పోయేలా చేసింది. బాధితురాలు బయటకు వచ్చి ఆక్రోశించినా మనోడు దర్జాగా బయటకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.





