విద్య పట్ల ఆసక్తే జ్ఞానానికి నాంది : ఘంటా చ‌క్ర‌పాణి

హైద‌రాబాద్ : అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీ వైస్ ఛాన్స‌ల‌ర్ డాక్ట‌ర్ ఘంటా చ‌క్ర‌పాణి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సామాజిక వేదిక ఎక్స్ ద్వారా త‌న ఆనందాన్ని పంచుకున్నారు .ఈ రోజు, నాకు అత్యంత ఇష్టమైన నటులలో ఒకరైన, అపార ప్రతిభావంతుడైన రాహుల్ రామకృష్ణను డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సాదరంగా ఆహ్వానించే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఆయన అక్కడ బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (బి.ఏ.) కోర్సులో చేరారు. రాహుల్ ఒక నిష్ణాతుడైన నటుడు మాత్రమే కాదు, సామాజిక స్పృహ, ఆలోచనాపరుడు కూడా. ఇంతటి విజయాన్ని సాధించినప్పటికీ, తన విద్యను కొనసాగించాలని ఆయన తీసుకున్న నిర్ణయం, అభ్యాసం అనేది జీవితాంతం కొనసాగే అన్వేషణ అనే విషయాన్ని శక్తివంతంగా గుర్తు చేస్తుందని స్ప‌ష్టం చేశారు.

నేర్చుకోవాలనే సంకల్పమే జ్ఞానానికి నిజమైన నిదర్శనం అని పేర్కొన్నారు. త‌న‌ ఎంపిక ఒక బలమైన సందేశాన్ని ఇస్తుందన్నారు. విద్యకు వయసుతో, అడ్డంకులతో, గమ్యంతో సంబంధం లేదన్నారు. ఎదగాలని కోరుకునే ప్రతి ఒక్కరి కోసం ఇది ఉద్దేశించ బడిందన్నారు. అంబేద్క‌ర్ యూనివ‌ర్శిటీ కుటుంబంలోకి రాహుల్‌కు తాను హృదయ పూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను . ఆయన విద్యా ప్రస్థానం సంతృప్తికరంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాన‌ని పేర్కొన్నారు. బిజీగా ఉండే వృత్తి జీవితంలో కూడా రాహుల్ రామకృష్ణ ఉన్నత విద్యను అభ్యసించడానికి సమయం కేటాయించ గలిగినప్పుడు, మీరు ఎందుకు కేటాయించ లేరంటూ పేర్కొన్నారు.

  • Related Posts

    యష్‌ను కలవడం చాలా ఆనందాన్నిచ్చింది

    ముంబై : ప్ర‌ముఖ బాలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. సోమ‌వారం ఆయ‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా పాన్ ఇండియా స్టార్ హీరో య‌శ్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించాడు. త‌న‌ను క‌లిసిన సంద‌ర్బంగా దిగిన ఫోటోల‌ను షేర్…

    యష్ ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రమాదం

    హైదరాబాద్: హైద‌రాబాద్ లో ని మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన యష్ చిత్రం ‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సౌండ్ బాక్స్ సెటప్ కూలి పోవడంతో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక విద్యార్థిని స్పృహ కోల్పోవడంతో ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *