20వ తేదీ లోపు పీసీసీకి నివేదిక అందిస్తాం : జ‌గ్గారెడ్డి

హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో నియామకాలకు సంబంధించి ఈ రోజు పీసీసీకి ఇవ్వాల్సిన నివేదిక పోస్ట్ పోన్ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ఇవాళ జ‌గ్గారెడ్డి మీడియాతో ఎమ్మెల్యే మందుల సామ్యూల్ తో క‌లిసి మాట్లాడారు. పూర్తిగా అన్ని అంశాలపై చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్ర‌తి ఒక్క‌రి అభిప్రాయాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు తెలిపారు జ‌గ్గారెడ్డి. ఇదిలా ఉండ‌గా ఈ నెల 18 లేదా 20 తేదీ లోపు పీసీసీకి నివేదిక అందజేస్తామని ప్ర‌క‌టించారు.

తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీలో అంతర్గత రాజకీయ వ్యవహారాలపై రెండ్రోజుల పాటు అభిప్రాయాలు తీసుకున్నాం అని చెప్పారు. ఈరోజు సాయంత్రం తుంగతుర్తి నివేదికని పీసీసీకి ఇవ్వాలని అనుకున్నాం అని అన్నారు. కానీ ఇంఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ల అభిప్రాయలు తీసుకోవాల్సి ఉంద‌న్నారు జ‌గ్గారెడ్డి. వారి అభిప్రాయాలు తీసుకోవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పారు . అందరూ కలిసి సమన్వయంతో కలిసి పని చేసేలా నిర్ణయం తీసుకుంటాం అన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తుంగతుర్తిలో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి.

  • Related Posts

    97 రద్దు చేయక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న

    హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ స‌ర్కార్ ప‌నితీరుపై. రేవంత్ రెడ్డి కి ఓటు వేసిన కర్మకు ఏ వర్గం ప్రజలు కూడా తృప్తిగా లేరన్నారు. ఇవాళ ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎవరిని…

    ఏపీ గ్రీన్ కార్య నిర్వాహ‌క క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌బాబు

    అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , శాస‌న మండ‌లి స‌భ్యుడు , ప్ర‌ముఖ న‌టుడు నాగబాబు కొణిద‌ల‌కు కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్టబెట్టింది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం, ప‌ర్యావ‌ర‌ణ హ‌రితంగా మార్చ‌చేందుకు స‌ర్కార్ కంక‌ణం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *