97 రద్దు చేయక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ స‌ర్కార్ ప‌నితీరుపై. రేవంత్ రెడ్డి కి ఓటు వేసిన కర్మకు ఏ వర్గం ప్రజలు కూడా తృప్తిగా లేరన్నారు. ఇవాళ ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎవరిని కదిలించినా శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. 1965 కింద ఏర్పడ్డ ఆర్. కె. పురం కాలనీని 22 A కింద పెట్టారని మండిప‌డ్డారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి అంటున్నాడు.. నీకు దమ్ముంటే ప్రజాక్షేత్రానికి వస్తావా అని చాలెంజ్ చేస్తున్నాన‌ని అన్నారు ఈట‌ల రాజేంద‌ర్. పాలిటెక్నిక్ కాలేజీలు కూడా రద్దు చేయడం దుర్మార్గం అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న వారికి అనేక మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. కొద్దిమంది ఇంజనీరింగ్ తీసుకొనే వార‌న్నారు ఎంపీ.

రేవంత్ రెడ్డికి ఏం పట్టిందో కానీ.. జీవో నెంబర్ 97 తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను స్కిల్ డెవలప్మెంట్ లో చేరుస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా మెరిట్ స్టూడెంట్స్ అని పేర్కొన్నారు. విద్యార్థులు డీమోరల్ అవుతున్నార‌ని ఎంపీ వాపోయారు. పోలీసులతో ఈ సమస్య పరిష్కారం చేద్దామని చూస్తే మాడి మసై పోతార‌ని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ స‌ర్కార్ కు. రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీకి పోదామంటే హౌస్ అరెస్ట్ చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు . తాత జాగీరులాగా.. డుడు బసవన్నలా.. నిర్ణయాలు తీసుకుంటే మెడలు వంచి సరి చేయిస్తామ‌ని ఫైర్ అయ్యారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే కాలగర్భంలో కలిసి పోవ‌డం ఖాయ‌మ‌న్నారు. జీవో నెంబర్ 97 రద్దు చేయకపోతే జరగబోయే పరిణామాలకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఈట‌ల రాజేంద‌ర్.

  • Related Posts

    ఏపీ గ్రీన్ కార్య నిర్వాహ‌క క‌మిటీ చైర్మ‌న్ గా నాగ‌బాబు

    అమ‌రావ‌తి : జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , శాస‌న మండ‌లి స‌భ్యుడు , ప్ర‌ముఖ న‌టుడు నాగబాబు కొణిద‌ల‌కు కీల‌క‌మైన ప‌ద‌వి క‌ట్టబెట్టింది ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప‌చ్చ‌ద‌నం, ప‌ర్యావ‌ర‌ణ హ‌రితంగా మార్చ‌చేందుకు స‌ర్కార్ కంక‌ణం…

    శ్రీవారి సేవకులకు మహిళల భద్రతపై ప్రత్యేక అవగాహన‌

    తిరుమ‌ల‌ : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి సేవకులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, అత్యవసర పోలీసు సేవలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తిరుమల టూ టౌన్ పోలీసులు, టీటీడీ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *