సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి

అమ‌రావ‌తి : సాగు నీటి రంగానికి సంబంధించి ఇంజ‌నీర్ కేఎల్ రావు చేసిన కృషి ఎన‌లేద‌ని కొనియాడారు ఏపీ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. శ్రీశైలం, నాగార్జున సాగర్, హీరాకుడ్, కోసీ లాంటి ప్రధానమైన డ్యామ్ ల నిర్మాణంలో కేఎల్ రావు కీలక పాత్ర పోషించారని చెప్పారు. ఐక్యరాజ్య సమితి తరపున అంతర్జాతీయ జల నిపుణులుగా ఈజిప్ట్, సూడాన్ లాంటి దేశాల్లోనూ సేవలందించారని చెప్పారు సీఎం. విజయవాడలో జన్మించి ఎంపీగా ఎన్నికై ముగ్గురు ప్రధానుల వద్ద కేంద్ర మంత్రిగా పని చేసిన ఘ‌న‌త త‌న‌ది అని పేర్కొన్నారు. నీటి పారుదల రంగం, జల విద్యుత్ ఉత్పత్తి లాంటి అంశాలపై పనిచేసి దేశానికి సేవలందించారని చెప్పారు.

శివ రామకృష్ణయ్య, కేఎల్ రావుల తర్వాత ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగంపై ఆలోచించిన వ్యక్తి ఎన్టీఆర్. సాగునీటి రంగాన్ని తీర్చిదిద్దటంలో వీరంతా నాకు ఎంతో స్పూర్తి అని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. జలధార కార్యక్రమంతో భూగర్భ జలాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం అని తెలిపారు. రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారిపోకుండా చర్యలు చేపట్టాం అన్నారు సీఎం. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, స్థానిక శాసనసభ్యుడు వసంత కృష్ణ ప్రసాద్ సహా ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

  • Related Posts

    ఢిల్లీ ప‌ర్య‌ట‌నలో మంత్రి ఎస్. స‌విత బిజీ

    అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్…

    చెరువుల్లో నీళ్ల‌ను వృధా చేస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు

    ప్ర‌కాశం జిల్లా : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంత్రి ఆనం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన డీఆర్సీ స‌మావేశంలో పాల్గొని ప్ర‌సంగించారు. చెరువులోని చేపలను పట్టుకునేందుకు నీటిని వదిలేస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. ప్రస్తుతం ఎల్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *