మ‌త‌ప‌ర‌మైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు

హైదరాబాద్ : మత పరమైన అంశాలకు సంబంధించిన హోంవర్క్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి బంధువు సుప్రియ గౌడ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ లో ఆమె తీవ్రంగా స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న మా మేనల్లుడిని తీసుకు రావడానికి నేను పాఠశాలకు వెళ్లాను. అతని డైరీలో పాఠ్యాంశానికి సంబంధం లేని విషయాలు ఉండటం గమనించానని పేర్కొన్నారు సుప్రియా గౌడ్. కల్మా , ‘సుక్రాల్ఫేట్’ (Sucralfate) చదవమని ఒక ఉపాధ్యాయుడు రాయడం నేను చూశానని చెప్పారు. . ఇది పూర్తిగా తప్పు… మీరు విద్యను అందిస్తున్నప్పుడు, కేవలం దానికే పరిమితం కావాలని పేర్కొన్నారు.

వివిధ మతాలు, నేపథ్యాల నుండి విద్యార్థులు ఇక్కడ చదువు కోవడానికి వస్తున్నారు. వారు నాణ్యమైన విద్య కోసం వస్తున్నారని టీచ‌ర్లు, యాజ‌మాన్యం గుర్తు పెట్టుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు సుప్రియా గౌడ్. ‘కల్మా’ ‘సుక్రాల్ఫేట్’ అనేవి పాఠ్యాంశంలో భాగం కానే కావ‌న్నారు. అవి మతపరమైన అంశాలు. వీటిని పాఠ్యాంశాలతో కలపకండి. ఒకవేళ మీరు దీన్ని ఒక సబ్జెక్ట్‌గా చేర్చాలనుకుంటే, భగవద్గీత లేదా బైబిల్‌ను సబ్జెక్ట్‌గా పెట్టండి అని నిప్పులు చెరిగారు. ఈ విషయంపై కఠిన చర్యలు తీసుకున్నందుకు పాఠశాల యాజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలియ జేస్తున్నాను. మేము డైరీని చూసి దీనిపై మా అభ్యంతరాన్ని వ్యక్తం చేశామన్నారు సుప్రియో గౌడ్. అసలు ఎంత మంది విద్యార్థుల డైరీలలో ఇలాంటివి రాస్తున్నారో నాకు తెలియదన్నారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల‌ని ఆమె కోరారు.

  • Related Posts

    ఇరాన్ వంతెన‌ల‌పై అమెరికా బాంబుల వ‌ర్షం

    ఇరాన్ : మ‌ధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్త‌త చోటు చేసుకుంది . మ‌రోసారి అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు దిగుతోంది. వ‌రుస‌గా బాంబుల వ‌ర్షం కురిపిస్తోంది. దాడుల‌తో బెంబేలెత్తిస్తోంది యుఎస్. తాజాగా హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల…

    ప్ర‌జ‌ల ఆస్తులు ప్ర‌వేట్ ప‌రం చేస్తే ఎలా..?

    తాడేప‌ల్లి గూడెం : ఏపీ కూట‌మి స‌ర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నార‌ని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *