దీదీ ఆస్తులు లక్ష‌ల్లో బాబు ఆస్తులు కోట్ల‌ల్లో

భార‌త దేశ రాజ‌కీయాల‌లో చ‌క్రం తిప్పే నాయ‌కుడిగా గుర్తింపు పొందారు టీడీపీ బాస్, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. త‌ను ఎక్క‌డ ఉంటే అక్క‌డ కార్పొరేట్ కంపెనీలు వాలి పోతాయి. ఆయ‌న‌పై ప‌లు ఆరోప‌ణ‌లు ఉన్నా. వాటిని ఎక్క‌డా బ‌య‌ట‌కు పొక్క‌కుండా చూసుకుంటార‌ని, చ‌క్క‌గా, ఎవ‌రికీ అనుమానం రాకుండా చ‌క్క బెట్టేస్తాడ‌ని, ఒక ర‌కంగా మేనేజ్ చేయ‌డంలో త‌న‌కు తానే సాటి అన్న పేరుంది. ప్ర‌స్తుతం మ‌రోసారి చంద్ర‌బాబు నాయుడు చ‌ర్చ‌నీయాంశంగా మారారు. ఆయ‌న ఆస్తులు ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా రూ. 931 కోట్లు ఉన్న‌ట్లు తేలింది. ఈ విష‌యాన్ని ఏడీఆర్ సంస్థ ప్ర‌క‌టించింది. దేశంలోని ముఖ్య‌మంత్రుల ఆస్తుల వివ‌రాల‌ను. అది ప‌క్క‌న పెడితే ఏం చేస్తే ఇంత పెద్ద ఎత్తున కోట్లు స‌మ‌కూరుతాయ‌నేది తెలిస్తే చెప్పాల‌ని ప్ర‌జలు ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌పంచ బ్యాంకుకు ఎక్కువ‌గా ప్రాధాన్య‌త ఇవ్వ‌డంలో త‌ను ముందుంటాడు. ఇది జ‌గ మెరిగిన స‌త్యం.

ఇక త‌న సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వంలో త‌న‌కు కోలుకోలేని షాక్ ఇచ్చింది మాత్రం ఒకే ఒక్క‌డు జ‌గ‌న్ రెడ్డి. అయితే దాని వెనుక ప్ర‌ధాని మోదీ, అమిత్ షా ప్లాన్ ఉంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న‌ను అరెస్ట్ చేయ‌డం, జైలుపాలు చేయ‌డం ఊహించ లేదు చంద్ర‌బాబు నాయుడుకు. ఇప్పుడు మ‌రోసారి త‌న స్టామినా ఏమిటో చూపిస్తున్నాడు. ఇది ప‌క్క‌న పెడితే ఆయా రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల ఆస్తుల‌ను చూస్తే దిమ్మ తిరిగి పోయేలా ఉంది. వీళ్లు కేవ‌లం ఎన్నిక‌ల‌లో పోటీ చేసే కంటే ముందు ఎన్నిక‌ల అఫిడ‌విట్ల‌లో పేర్కొన్న వివ‌రాలు మాత్ర‌మే. ఇంకా తెలియ‌నివి, బినామీల రూపంలో దాచుకున్న‌వి, విదేశీ బ్యాంకుల‌లో జ‌మ చేసిన వాటి గురించి చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే చంద్ర‌బాబు ప్ర‌క‌టించింది కేవ‌లం త‌న‌కు సంబంధించిన‌వే. త‌న‌తో పాటు కొడుకు లోకేష్ , కోడ‌లు నారా బ్ర‌హ్మాణి, భార్య భువనేశ్వ‌రి, బావ‌మ‌రిది బాల‌కృష్ణ ఆస్తుల‌న్నింటిని క‌లిపితే అవి రూ. 2 వేల కోట్ల‌కు దాటుతాయ‌ని అంచ‌నా.

మ‌రో వైపు మిగ‌తా సీఎంల సంగ‌తి చూస్తే ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర సీఎం పెమా ఖండు 2వ ప్లేస్ లో నిలిచారు. ఆయ‌న ఆస్తుల విలువ రూ. 332 కోట్లు . ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య ఆస్తులు రూ. 51గా తేల్చింది ఏడీఆర్ సంస్థ‌. అత్య‌ధిక ఆస్తులు క‌లిగిన వారిలో వీరికి చోటు ద‌క్క‌గా అత్యంత అత్య‌ల్ప ఆస్తులు క‌లిగిన ముఖ్య‌మంత్రుల‌లో తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ మ‌రోసారి నిలిచారు. ఆమె ఆస్తులు కేవ‌లం రూ. 15.38 ల‌క్ష‌లు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం . ఈ జాబితాలో జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఒమ‌ర్ అబ్దుల్లా ఆస్తులు కూడా ప్ర‌క‌టించారు. త‌న ఆస్తులు రూ. 55.24 ల‌క్ష‌లు మ‌త్ర‌మేన‌ని పేర్కొన్నారు. ఇక సీపీఎం పార్టీకి చెందిన కేర‌ళ రాష్ట్ర ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ ఆస్తులు రూ. 1.18 కోట్లు ఉన్నాయి.. త‌క్కువ ఆస్తులు క‌లిగిన ముఖ్య‌మంత్రుల‌లో భ‌జ‌న్ లాల్ శ‌ర్మ (రాజ్ ) రూ. 1.46 కోట్లు ఉండ‌గా ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్ ఆస్తులు రూ. 1.54 కోట్లు, బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ ఆస్తులు రూ. 1.64 కోట్లు, పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్ మాన్ ఆస్తులు రూ. 1.97 కోట్లు ఉన్నాయి.

ఇక ఒడిశా సీఎం మోహ‌న్ మాఝీ ఆస్తులు రూ. 1.97 కోట్లు ఉండ‌గా ఛత్తీస్ గ‌ఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి ఆస్తులు రూ. 3.80 కోట్లు ఉన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. వీరంద‌రి ఆస్తులు క‌లిపితే చాలు ఎన్నో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేయ‌వ‌చ్చు. ఇక క్రిమిన‌ల్ కేసుల్లో తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి టాప్ లో నిలిచాడు. ఈయ‌న సీఎం చంద్ర‌బాబు నాయుడు శిష్యుడు. త‌న‌పై 86 కేసులు న‌మోద‌య్యాయి. చంద్ర‌బాబు 3వ స్థానంలో ఉన్నాడు. 30 మందికి పైగా సీఎంల‌లో 12 శాతానికి పైగా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు కావ‌డం గ‌మ‌నార్హం. అటు ఆస్తుల సంపాద‌న‌లో ఇటు క్రిమిన‌ల్ కేసుల‌లో ముఖ్య‌మంత్రులు ముందంజ‌లో కొన‌సాగుతుండ‌డం విస్తు పోయేలా చేస్తోంది. ఇది ప్రజాస్వామ్యానికి మ‌రింత ప్ర‌మాద‌క‌రం. ప్ర‌జానీకం నిద్ర పోతున్నంత కాలం నేత‌లు ఇలాగే త‌యారవుతారు. ఇక‌నైనా ఓటు విలువ గుర్తించాలి..అవినీతి ర‌హిత స‌మాజం, దేశం కోసం 143 కోట్ల మంది ప్ర‌య‌త్నం చేయాలి. లేక పోతే మ‌న భ‌విష్య‌త్తు అంధ‌కారంలోకి కూరుకు పోతుందని గుర్తించాలి.

  • Related Posts

    భూమి పుత్రుడా..గాయ‌కుడా అల్విదా..!

    అస్సాం న‌గ‌రం జ‌న సంద్రంగా మారింది దుఖఃంతో. త‌మ భూమి పుత్రుడు జుబీన్ గార్గ్ అనుమానాస్ప‌ద మ‌ర‌ణం ప్ర‌తి ఒక్క‌రినీ కంట‌త‌డి పెట్టించేలా చేసింది. అశేష జ‌న‌వాహిని త‌న‌కు అశ్రునివాళులు అర్పించేందుకు బారులు తీరారు. అస్సాం అంటేనే భూపేన్ హ‌జారికా గుర్తుకు…

    కుల వివ‌క్ష నిజం దేశానికి ప్ర‌మాదం

    ఈ దేశంలో కుల ర‌క్క‌సి కుట్ర‌ల‌కు తెర లేపుతోంది. కోట్లాది మాన‌వ స‌మూహాన్ని విభ‌జించ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తోంది. ఇది అణ్వాయుధాలు, మిస్సైల్స్ కంటే అత్యంత ప్ర‌మాదాక‌ర‌మైన‌ది అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *