కేసీఆర్ ను క‌లిసిన హ‌రీశ్ రావు

తాజా ప‌రిణామాల‌పై చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ : తీవ్ర ఆరోప‌ణ‌ల మ‌ధ్య ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని హైద‌రాబాద్ కు వచ్చిన బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి హ‌రీశ్ రావు శ‌నివారం హుటా హుటిన ఎర్ర‌వ‌ల్లి ఫామ్ హౌస్ లో ఉన్న మాజీ సీఎం కేసీఆర్ ను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల గురించి వీరు చ‌ర్చించిన‌ట్లు సమాచారం. ప్ర‌ధానం గా స్వంత కూత‌రు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఆపై హ‌రీశ్ రావును ల‌క్ష్యంగా చేసుకుంది. షాకింగ్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ప్ర‌ధానంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అంతులేని అవినీతి చోటు చేసుకుంద‌ని, దీనికి ప్ర‌ధాన కార‌కుడు హ‌రీశ్ రావుతో పాటు సంతోష్ రావు కూడా ఉన్నారంటూ ఆరోపించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు హ‌రీశ్ రావు. ఇది కావాల‌ని చేసిన కామెంట్స్ త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు.

త‌న జీవితం తెరిచిన పుస్త‌కం అని స్ప‌ష్టం చేశాడు హ‌రీశ్ రావు. తాను అక్ర‌మంగా ఒక్క పైసా తీసుకోలేద‌ని ప్ర‌క‌టించాడు. తాను ముందు నుంచీ టీఆర్ఎస్ పార్టీ కాక పోయిన‌ప్ప‌టి నుంచి ప‌ని చేస్తూ వ‌చ్చాన‌ని అన్నారు. ఉద్య‌మ స‌మ‌యంలో , పార్టీ ప‌రంగా బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించానని ఈస‌మయంలో త‌న‌పై నిరాధార ఆరోప‌ణ‌లు చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు హ‌రీశ్ రావు. ఏదైనా ఉంటే , అనుమానాలు త‌ల ఎత్తితే స్వ‌యంగా తండ్రి కేసీఆర్ తో లేదా అన్న కేటీఆర్ తో లేదా త‌న‌తో మాట్లాడాల్సి ఉండాల్సింద‌న్నారు. కానీ ఇలా బ‌య‌ట‌కు వ‌చ్చి ర‌చ్చ చేస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతుంద‌ని బీఆర్ఎస్ బాస్, తండ్రి కేసీఆర్ త‌న త‌న‌యురాలు క‌విత‌పై బ‌హిష్క‌ర‌ణ వేటు వేశారు.

  • Related Posts

    ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబ‌ర్ వ‌న్

    ప్ర‌క‌టించిన మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ రంగంలో ఏపీ టాప్ లో ఉంద‌న్నారు. ఈ 17 నెలల కాలంలో సూపర్ సిక్స్ పథకాలను పూర్తిగా నెరవేరుస్తూ…

    రైతుల‌ను బ‌లోపేతం చేయ‌డంలో నాబార్డ్ కృషి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క హైద‌రాబాద్ : ఈ దేశానికి వెన్నెముక‌గా రైతులు ఉన్నార‌ని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. రైతుల‌కు అన్ని విధాలుగా అండ‌గా ఉంటూ వారిని మ‌రింత అభివృద్ది చేసేందుకు ప్ర‌య‌త్నం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *