కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ శశి థరూర్
కేరళ : తిరువనంతపురం కాంగ్రెస్ పార్టీకి చెందని ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మరోసారి కేరళస్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ గురించి ప్రస్తావించాడు. తను శాంసన్ ను 14 ఏళ్ల వయసులో త్రివేండ్రంలోని ఒక క్లబ్ తరఫున ఆడుతున్నప్పుడు చూశానని తెలిపాడు. ఆ సమయంలో తనలో ఏదో స్పార్క్ ఉందని గుర్తించానని పేర్కొన్నాడు ఎంపీ. అంతటితో ఆగక తాను వెళ్లి శాంసన్ ను వ్యక్తిగతంగా కలిశానని, తనను అభినందించానని చెప్పాడు. ఆనాటి నుంచి నేటి దాకా శాంసన్ పై ఓ కన్నేసి ఉంచానని వెల్లడించారు శశి థరూర్.
అంతే కాదు తాను అతని కెరీర్‌ను మొదటి నుండి చూస్తూ వచ్చానని తెలిపాడు. తాను ఎంపీగా ఉన్నప్పటికీ తాను సంజుకి పెద్ద అభిమానినని పేర్కొన్నాడు ఎంపీ. అతని విలువను నిరూపించు కోవడానికి అతనికి ఎప్పుడూ చాలా కాలం పాటు అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ ఇవాళ 11 ఏళ్ల తర్వాత తాను అనుకున్నది సాధించాడని, తాను ఏమిటో నిరూపించుకునే ప్రయత్నం చేశాడని ప్రశంసలు కురిపించాడు. ఒకవేళ ఆ స్థానంలో ఎవరు ఉన్నా అంత గొప్పగా ఆడలేక పోయి ఉండేవారని తన అబిప్రాయాన్ని వ్యక్తం చేశారు శశి థరూర్.








