భార‌త్ స‌త్తా ఆసియా క‌ప్ హాకీ విజేత

ఫైన‌ల్ లో ద‌క్షిణా కొరియాకు షాక్

భార‌త పురుషుల హాకీ జ‌ట్టు సంచ‌ల‌నం సృష్టించింది. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఆసియా క‌ప్ ను కైవ‌సం చేసుకుంది. ఫైన‌ల్ మ్యాచ్ లో పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఏకంగా 4-1 గోల్స్ తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ఏకంగా ఛాంపియ‌న్ గా నిలిచింది. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ప్ర‌పంచ క‌ప్ కు నేరుగా అర్హ‌త సాధించింది టీమిండియా. సెమీ ఫైన‌ల్ లో బ‌ల‌మైన చైనా హాకీ జ‌ట్టుకు ఝ‌ల‌క్ ఇచ్చింది. ఒక్క గోల్ కూడా చేయ‌నీయ లేదు మ‌న ఆట‌గాళ్లు. 7-0 గోల్స్ తేడాతో ఓడించి షాక్ ఇచ్చింది. ఇక ఫైన‌ల్ లో సైతం దుమ్ము రేపింది. ఈ టోర్నీలో ఏ ఒక్క మ్యాచ్ భార‌త్ ఓడి పోలేదు. అన్ని మ్యాచ్ ల‌ను గెలుపొందింది. అస‌లైన ఛాంపియ‌న్ గా అవ‌త‌రించింది.

ఈ టోర్నీ లో ఐదు విజయాలు, ఒక డ్రా మాత్ర‌మే చేసుకుంది. హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని జట్టు తమ మూడు పూల్ మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. సూపర్ 4లలో వ దక్షిణ కొరియాతో 2-2తో డ్రాగా ముగిసిన తర్వాత వరుసగా మలేషియా, చైనాలను 4-1 , 7-0 తేడాతో ఓడించారు. ఇది భారతదేశం జ‌ట్టుకు సంబంధించి నాల్గవ ఆసియా కప్ టైటిల్ గెలుచు కోవ‌డం. గతంలో 2003, 2007, 2017లో టోర్నమెంట్‌ను గెలుచుకుంది. దక్షిణ కొరియా ఐదుసార్లు 1994, 1999, 2009, 2013, 2022లో విజేత‌గా నిలిచింది. ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసి ఛాంపియ‌న్ గా నిలిచినందుకు జ‌ట్టును ప్ర‌త్యేకంగా అభినందించారు ప్ర‌ధాని మోదీ.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *