యుఏఈకి షాక్ భార‌త్ ఝ‌ల‌క్

Spread the love

9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ

యుఏఈ : యూఏఈ వేదిక‌గా ఆసియా క‌ప్ 2025లో జ‌రిగిన ప్రారంభ మ్యాచ్ లో ఆతిథ్య జ‌ట్టు యూఏఈకి చుక్క‌లు చూపించింది భార‌త్. కేవ‌లం ఒకే ఒక్క వికెట్ కోల్పోయి భార‌త్ 9 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. కుల్దీప్ యాద‌వ్ , శివ‌మ్ దూబే బౌలింగ్ తో బెంబేలెత్తించారు. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టును త‌క్కువ స్కోర్ కే క‌ట్ట‌డి చేశారు. భార‌త్ టైటిల్ హాట్ ఫెవ‌రేట్ గా ఉంది. ఎట్టకేల‌కు సంజూ శాంస‌న్ ను వికెట్ కీప‌ర్ గా వాడుకున్నాడు హెడ్ కోచ్. జితేశ్ శ‌ర్మ 30 ర‌న్స్ చేస్తే, గిల్ 20 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు.

జ‌స్ ప్రీత్ బుమ్రా 3 ఓవ‌ర్ల‌లో 19 ప‌రుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇక కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ శాంస‌న్ క‌ళ్లు చెదిరేలా బంతిని ఒడిసి ప‌ట్టుకుని ఔరా అనిపించేలా చేశాడు. త‌ను శివమ్ దూబే బౌలింగ్ లో ఫోర్ పోయే బాల్ ను అడ్డుకుని గాల్లో క్యాచ్ ప‌ట్టాడు. ఇక శాంస‌న్ ను ఓపెన‌ర్ గా తీసుకుంటాడ‌ని భావించారు. కానీ ఎందుక‌నో గౌత‌మ్ గంభీర్ శుభ్ మ‌న్ గిల్ , శ‌ర్మ‌ల‌ను పంపించాడు. ఒక‌వేళ ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు గ‌నుక భారీ స్కోర్ చేస్తే ఇండియా త‌ర‌పున మిడిల్ ఆర్డ‌ర్ లో శాంస‌న్ ను వాడుకునేలా ప్లాన్ చేసిన‌ట్లు క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. గ‌త సీజ‌న్ లో ఆసియా క‌ప్ విజేత‌గా నిలిచింది భార‌త జ‌ట్టు.

ప్రస్తుతం ఈ టోర్నీలో కొత్త జ‌ట్లు కూడా పాల్గొనేందుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఓకే చెప్పింది. మ‌రో వైపు ఆఫ్గ‌నిస్తాన్ జ‌ట్టు తొలి మ్యాచ్ లో బోణీ కొట్టింది. ఆ టీమ్ హాంకాంగ్ ను ఓడించింది.

  • Related Posts

    ఐపీఎల్ లో హ్యాట్రిక్ కొట్టాల‌ని ఉంది : విరాట్ కోహ్లీ

    Spread the love

    Spread the loveఇప్ప‌టికే ఆర్సీబీ రెండు సార్లు విజేత‌గా నిలిచింది అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 19వ సీజ‌న్ టైటిల్ విజేత‌గా నిలిచింది ర‌జ‌త్ పాటిదార్ నాయ‌క‌త్వంలోని రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు. గుజ‌రాత్ రాజ‌ధాని అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన ఫైన‌ల్ మ్యాచ్…

    శుభ్‌మన్ గిల్ పై భ‌గ్గుమ‌న్న వీరేంద్ర సెహ్వాగ్

    Spread the love

    Spread the loveబాధ్య‌తా రాహిత్యంత కూడుకున్న ఆట ఇది ముంబై : ప్ర‌ముఖ క్రికెట‌ర్ , కామెంటేట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ఇంత కీలకమైన IPL మ్యాచ్‌లో, అది కూడా ఒక ఫైనల్‌లో, శుభ్‌మన్ గిల్ నుండి మీరు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *