రెండేళ్ల‌లో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల

అమ‌రావ‌తి : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆ దేవుడి ద‌య వ‌ల్ల‌, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ముందు చూపు వ‌ల్ల స‌మృద్దిగా జ‌లాలు ఉన్నాయ‌ని చెప్పారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మిగిలి పోయిన ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూ్ర్తి చేసేందుకు యాక్ష‌న్ ప్లాన్లు సిద్దం చేయాల‌ని ఇప్ప‌టికే సీఎం ఆదేశించార‌ని తెలిపారు. ఎక్క‌డ కూడా ఆయా మిగిలి పోయిన ప్రాజెక్టుల‌కు ఒక్క రూపాయి కూడా ఆనాటి జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ కేటాయించ లేద‌ని ఆరోపించారు. దీని కార‌ణంగా ఆ భారం ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కార్ పై ప‌డిందన్నారు. సీఎం చంద్ర‌బాబు నీటి విధానం వ‌ల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జ‌రిగింద‌ని చెప్పారు నిమ్మ‌ల రామా నాయుడు.

ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు వంశధార, నాగావళి, జంఝావతి, మహేంద్ర తనయ వంటి కీలకమైన 9 ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించార‌ని పేర్కొన్నారు. వరికిపూడి శిల ప్రాజెక్ట్ కు ఉన్న అడ్డంకులను అధిగమించేలా అనుమతులు తీసుకోవాలని సూచించారని తెలిపారు మంత్రి. రాష్ట్రం లో 1040 లిఫ్ట్ లు ఉంటే 613 లిఫ్ట్ లు ప్ర‌స్తుతం పని చేయడం లేదన్నారు. గత ఐదేళ్లలో రిపేర్లకు ఒక్క రూపాయి ఖర్చు చేయక పోవడంతో లిఫ్ట్ స్కీం లు మరుగున పడ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఐదేళ్లు పాలన విధ్వంసం వైపు తీసుకెళ్లారని,. ఐడీసీ నే దీనికి ఉదాహరణ అన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని రాష్ట్రంలో కరువు లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    సీఎంను క‌లిసిన అన‌లాగ్ ఏఐ సీఈవో

    తెలంగాణ రైజింగ్ గ్లోబ‌ల్ స‌మ్మిట్ కు ఆహ్వానం హైద‌రాబాద్ : ప్ర‌ముఖ ఐటీ దిగ్గ‌జ కంపెనీ అన‌లాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైద‌రాబాద్ లో మ‌ర్యాద పూర్వ‌కంగా గురువారం సీఎం ఎ. రేవంత్ రెడ్డిని…

    కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం

    విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ అనుమ‌తి హైద‌రాబాద్ : రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్ప‌టికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించింది. ఇదే ఊపును స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో చూపించాల‌ని అనుకుంటోంది. ప్ర‌ధాన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *