రెండేళ్ల‌లో 9 ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Spread the love

నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల

అమ‌రావ‌తి : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆ దేవుడి ద‌య వ‌ల్ల‌, సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ముందు చూపు వ‌ల్ల స‌మృద్దిగా జ‌లాలు ఉన్నాయ‌ని చెప్పారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మిగిలి పోయిన ప్రాజెక్టుల‌ను త్వ‌రిత‌గ‌తిన పూ్ర్తి చేసేందుకు యాక్ష‌న్ ప్లాన్లు సిద్దం చేయాల‌ని ఇప్ప‌టికే సీఎం ఆదేశించార‌ని తెలిపారు. ఎక్క‌డ కూడా ఆయా మిగిలి పోయిన ప్రాజెక్టుల‌కు ఒక్క రూపాయి కూడా ఆనాటి జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ కేటాయించ లేద‌ని ఆరోపించారు. దీని కార‌ణంగా ఆ భారం ప్ర‌స్తుత కూట‌మి స‌ర్కార్ పై ప‌డిందన్నారు. సీఎం చంద్ర‌బాబు నీటి విధానం వ‌ల్ల రాష్ట్రానికి ఎంతో మేలు జ‌రిగింద‌ని చెప్పారు నిమ్మ‌ల రామా నాయుడు.

ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు వంశధార, నాగావళి, జంఝావతి, మహేంద్ర తనయ వంటి కీలకమైన 9 ప్రాజెక్టులను రెండేళ్లలో పూర్తి చేసేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించార‌ని పేర్కొన్నారు. వరికిపూడి శిల ప్రాజెక్ట్ కు ఉన్న అడ్డంకులను అధిగమించేలా అనుమతులు తీసుకోవాలని సూచించారని తెలిపారు మంత్రి. రాష్ట్రం లో 1040 లిఫ్ట్ లు ఉంటే 613 లిఫ్ట్ లు ప్ర‌స్తుతం పని చేయడం లేదన్నారు. గత ఐదేళ్లలో రిపేర్లకు ఒక్క రూపాయి ఖర్చు చేయక పోవడంతో లిఫ్ట్ స్కీం లు మరుగున పడ్డాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఐదేళ్లు పాలన విధ్వంసం వైపు తీసుకెళ్లారని,. ఐడీసీ నే దీనికి ఉదాహరణ అన్నారు. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని రాష్ట్రంలో కరువు లేకుండా చేయడమే చంద్రబాబు లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు.

  • Related Posts

    కేంద్ర స‌ర్కార్ కు టీడీపీ పూర్తి మ‌ద్ద‌తు

    Spread the love

    Spread the loveమహిళా సాధికారత దిశగా అడుగులు న్యూఢిల్లీ : ఏపీకి చెందిన మ‌హిళా ప్ర‌జా ప్ర‌తినిధులు పెద్ద ఎత్తున ఢిల్లీ బాట ప‌ట్టారు. పార్ల‌మెంట్ లో మూడు చారిత్రాత్మ‌క‌మైన బిల్లులు ప్ర‌వేశ పెట్టేందుకు శ్రీ‌కారం చుట్టారు . ఈ సంద‌ర్బంగా…

    రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడ‌ల్ ప‌నికి రాదు

    Spread the love

    Spread the loveపార్ల‌మెంట్ లో బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీ తేజ‌స్వి సూర్య‌. గురువారం పార్ల‌మెంట్ సాక్షిగా ఆగ్ర‌హం వ్య‌క్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *