
వెల్లడించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్
ముంబై : భారత క్రికెట్ జట్టు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీలక ప్రకటన చేశారు. ముంబై లో ఆయన మీడియాతో మాట్లాడారు. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే టీమిండియాకు సంబంధించిన జెర్సీ స్పాన్సర్ షిప్ కోసం బిడ్ లు పిలవడం జరిగిందన్నారు. మరో రెండు వారాల్లో ఎవరికి దక్కుతుందనే దానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు. గతంలో కంటే ఈసారి ఎక్కువ సంస్థలు పోటీ పడ్డాయని ఇది ఎవరూ ఊహించ లేదన్నారు. క్రికెట్ జట్టు అద్భుత విజయాలు సాధిస్తుండడం దీనికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. అంతే కాదు ఇటీవలే ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక జనాదరణ కలిగిన టోర్నీగా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ (ఐపీఎల్) నిలిచిందన్నారు రాజీవ్ శుక్లా.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు భారత క్రికెట్ జట్టుకు సంబంధించి స్పాన్సరర్ గా ప్రముఖ ఆన్ లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 ఉండేది. ప్రతి ఏడాదికి రూ. 358 కోట్లు చెల్లించేది. ఇటీవల కేంద్రం ఆన్ లైన్ గేమింగ్, బెట్టింగ్ , డ్రగ్స్ కు సంబంధించిన సంస్థలు, ప్రకటనలను నిషేధించింది. ఈ మేరకు బిల్లు కూడా తీసుకు వచ్చింది. దీంతో తాము టీమ్ ఇండియా జట్టు స్పాన్సర్సిప్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. బీసీసీఐ గత్యంతరం లేక మరోసారి బిడ్ కోసం ప్రకటన జారీ చేసింది. ఇండియాతో పాటు ఇతర దేశాలకు చెందిన పేరొందిన కంపెనీలు, సంస్థలు బిడ్ లో పాల్గొన్నాయి. గడువు ముగియడంతో బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఈ మేరకు రెండు వారాలలో బీసీసీఐ కీలక ప్రకటన చేస్తుందన్నారు.